చైనా “జియా” బ్యూటిఫుల్

Share this News:

రోబో సినిమాలో ఇనుములో హృదయం మొలిచెనే  అనే  పాట గుర్తుందా  సరిగా అదే నిజం చేస్తూ ఓ రోబో లో   హృదయన్ని మోలిపించారు  శాస్త్ర వేత్త లు  అంతే కాదు భలే అందం గా కూడా డిజైన్ చేసారు .. జియా ,జియో సెల్ ఫోన్ నెట్ వర్క్ లు కాదు జస్ట్ సిమిలర్ గా ఉన్న పేర్లు అంతే మ్యాటర్ ఏంటి అంటే అమ్మాయిలాంటి అందమైన ముద్దు బొమ్మ కృత్రిమ అవయవాలు, మేథస్సుతో రూపు దిద్దుకున్న ఓ రోబో. పేరు జియా జియా. అం దంతోపాటు అణుకువతో కనిపిస్తున్నఆమెను చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. తోటి అమ్మాయిలు సయితం ఈర్ష్య పడేంత సౌందర్యం ఆమె సొంతం. చైనా అమ్మాయిలు బొమ్మల్లా ఉంటారు అనే విషయం అంతో ఇంతో నెట్ టచ్ వున్నా అందరికి తెలిసే ఉంటుంది .
చైనా లోని యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ రోబో జియా జియా ను తయారు చేసారు ఆ పై షాంఘై నగరంలో దీన్ని ప్రదర్శించారు. ఈ రోబో ప్రత్యేకత మనుషులతో మాట్టాడడం. ఎదుట వ్యక్తులతో సంభాషించడం, హావభావాలు పలికించడం లాంటివి కూడా ఈ రోబో చేయగలుగుతుంది. మరో ఐదు నుంచి పదేళ్లలో ఇంటి పనులు చేయడం, ఆస్పత్రిలో నర్సు విధులు నిర్వర్తించడం, హోటళ్లలో వంటలు చేయడం, వెయిటర్ పనులు సొంతంగా చేసే స్థాయికి దీని మెమరీ ని ఇంప్లిమెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు.

నమిత ప్రమోద్ న్యూ గ్యాలరీ
మధురిమ ఫొటోషూట్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*