గండికోట ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నముఖ్యమంత్రి చంద్రబాబు

Share this News:

కడప జిల్లా గండి కోట జలాశయం నిర్మాణం పూర్తయింది..ఈ జలాశయం ఆధారం గ కడప అనంతపురం జిల్లాలో మరిన్ని ఎట్టి పోతల పధకాలు ప్రారంభించే అవకాశం కలుగ నుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో లో ఈ ప్రాజెక్ట్ కు బీజం పడింది మొదట్లో 16 టీ ఎం సి ల సామర్ధ్యం అనుకున్నప్పటికీ కాల క్రమం లో 26 .85 టీ ఎం సి ల సామర్ధ్యానికి చేరుకొని ఇప్పటికి పనులు పూర్తయ్యి అందుబాటులోకి రానుంది . తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పనులు వేగాన్ని పెంచుకొని రైతులకు నీరిచ్చేందుకు సిద్ధం అయ్యింది. గాలేరు – నగరి సుజల స్రవంతి లో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ అది నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా పులివెందుల కూడా సస్య శ్యామలం అవుతుంది . ఈ జలాశయం ఆధారం గా మరో కొన్ని ఎట్టి పోతల పధకాలు వచ్చే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అది కారులు అంటున్నారు. గండి కోట ప్రాజెక్ట్ ను ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు రేపు ప్రారంభించటంద్వారా ప్రజలకు అంకితం చేయనున్నారు మొదటి దశలో 35 వేల ఎకరాలకు, రెండవ దశలో 1 .20 లక్షల ఎకరాలకు నీరందుతుంది . ప్రధాన నీటి వనరైన శైలం మిగులు జలాలను పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా గండికోటకు నీరందుతుంది ..మొత్తం గా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది

హృ దయాన్ని కదిలించే రైతు కన్నీరు వీడియో సాంగ్ ఇదిగో..
చైనా “జియా” బ్యూటిఫుల్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*