శారీరక శ్రమ చేయ్‌.. సంతోషం రెట్టింపు చేయ్‌..!

Share this News:

man-with-laptop-outside

శ్రమకొద్దీ ఫలితం అని పెద్దలు అనేది వినేఉంటాం.. కాని ఆ ఫలితం సంతోషమే మరేదో కాదని పరిశోధకులు తేల్చారు..
కొద్దిపాటి శారీరక శ్రమకూడా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావంచూపి సంతోషాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈమేరకు పదివేల మందిపై జరిపిన స్మార్ట్‌ఫోన్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందనే విషయం తెలిసిందే! అయితే, మానసిక ఆరోగ్యానికి, సంతోషంగా ఉండడానికి చెమటోడ్చేలా కష్టపడాల్సిన అవసరంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజువారీ వ్యవహారాలలో శారీరక శ్రమ ఉండేలా చూసుకున్నా సంతోషంగా ఉండొచ్చని కేంబ్రిడ్జి, ఎసెక్స్‌ యూనివర్సిటీల పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని మూడ్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా పదివేల మంది వలంటీర్లను పరిశీలించినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా.. రోజులో వివిధ సమయాలలో వారి మూడ్‌, వారి శారీరక శ్రమకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామని చెప్పారు. ఈ వివరాలను పరిశీలించగా.. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రోజంతా యాక్టివ్‌గా, సంతోషంగా ఉన్నట్లు తేలిందని వివరించారు. మరెందుకు ఆలస్యం.. వ్యాయమం చేయకున్నా కొద్దిపాటి శారీరక శ్రమ చేసి లైఫ్‌ని ఎంజాయ్‌ చేయండి మరి..

హిందువులు లౌకికవాదులే : అసదుద్దీన్‌
‘ఎయిర్‌ ఇండియా’ ప్రపంచ చెత్త సర్వీస్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*