హిందువులు లౌకికవాదులే : అసదుద్దీన్‌

Share this News:

ఏదో ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తూ.. వివాదస్పదంగా నిత్యం  వార్తల్లో నిలిచే మజ్లిస్‌ ఎంపీ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ‘దేశంలోని హిందువులలో ఎక్కువమంది లౌకికవాదులేనని నా నమ్మకం. అద్భుత వాక్చాతుర్యం కలిగిన(మోదీ) వారివెంట కొంతమంది మాత్రమే నడుస్తుంటారు. మతపరమైన విభేదాలు తొలిగిపోవాలంటే ముందుగా అధికారంలో ఉన్నవారి మైండ్‌ సెట్‌ మారాలి’ అంటూ భారీ డైలాగే చెప్పారు.. దీనితోపాటు ముస్లింలు, హిందువుల మధ్య విభేదాలు పెరగడానికి కాంగ్రెస్సే కారణమని ఇంత కాలం అంటకాగిన పార్టీనే దుమ్మెత్తి పోశారు. ఇక దేశభక్తి అనే అంశానికి సంబంధించి ఏ నినాదం వచ్చిన దాంట్లో కొత్త కోణం వెతికే ఆయన తాజాగా ఆ విషయంలోనూ ఆశ్చర్యం కలిగించేలా మాట్లాడారు.. జాతీయ గీత ఆలాపన సమయంలో నేను లేచి నిలబడతా. ఎందుకంటే చట్టం అలా చెబుతోంది కాబట్టి అంటూ దేశంపై తన ప్రేమను తెలియజేశారు.

విజయవాడ డిజి మేళాలో ఆధార్ కేంద్రానికి భారీ స్పందన
శారీరక శ్రమ చేయ్‌.. సంతోషం రెట్టింపు చేయ్‌..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*