పర్యావరణం జాగ్రత్త కూడా ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిందేనా.!

Share this News:

పర్యావరణం మీద జాగ్రత్త తీసుకోక పొతే జరిగే పరిణామాల్ని ఏరోజుకారోజు చవి చూస్తున్నా ఇంకా మనం మారక పోవడం శోచనీయం .పర్యావరణం ప్రాముఖ్యత గురించి నిన్న మొన్నటి జనతా గ్యారేజ్ వంటి సినిమాలు వచ్చినా..శ్రీమంతుడు వంటి సినిమాలు వచ్చినా ప్రధాని మోడీ లాంటి వాళ్ళు స్వచ్ఛ భారత్ వంటివి చేసిన కంటి తుడుపు చర్యలే తప్ప ఇంకొక ఉపయోగం లేదు అనేది నిజం, మార్పు రావాల్సింది సమాజం లో ఎవరో ఒకరు చెప్తే  మార్పు రాదు మన అంతట మనకి రావాలి ..నిన్న మొన్నటి ఢిల్లీ ,గుర్గావ్ వంటి పట్టణాల్లో కాలుష్యం ప్రభావం ఎంత తీవ్రం గా వుందో ప్రత్యేకం గా చెప్పే అవసరం లేదు.

ఇదంతా సోది అనుకోకండి మేటర్స్ కి వస్తే ..మన పొరుగు దేశం చైనా ..ఇప్పటికే అక్కడి నుంచి బోలెడు టెక్నాలజీ ని వాడుకొని మనం ఏమి చేతకాని వాళ్ళం అనే పేరు దాదాపు ఖాయం చేసుకున్నాం ..తాజాగా ఆ దేశం పర్యావరణం మీద దృష్టి పెట్టి పర్యావరణ రక్షణ కోసంప్రత్యెక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ..ఎన్విరాన్మెంటల్ పోలీస్ అనే పేరు కూడా పెట్టేసారు . టెక్నాలజీ ని వాడుకున్నట్టు ఆ పోలీస్ ని కూడా  వాడుకుంటే మన స్వతంత్రం మనమే తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది .దయచేసి మన  పర్యా వరణాన్ని మనం కాపాడుకుందాం మన  దేశాన్ని కాపాడుకొందాం మార్పు తెద్దాం  ….లెట్స్ గ్రీన్ ఇండియా

గౌతమిపుత్ర విజయంకోరుతూ అమెరికాలో ప్రత్యేక పూజలు
విజయవాడ డిజి మేళాలో ఆధార్ కేంద్రానికి భారీ స్పందన

Share this News:

Leave a comment

Your email address will not be published.

*