టిక్కెట్‌ ఇవ్వలేదని గొంతు కోసుకున్నాడు!

Share this News:

chiru-vandanamనచ్చిన హీరో సినిమా టిక్కెట్‌ దొరకకపోతే ఎంత బాధ కలుగుతుందో అభిమానులే చెప్పగలరు.. అది కాస్త ఎక్కువైతే తట్టుకోలేక ఏదైనా చేసే స్థాయికి వెళతారు.. ఆ క్రమంలోనే వేరేవారితో గొడవ పడటం.. థియేటర్‌ యజమానులతో వాగ్వాదానికి దిగడం మనం చూసే ఉంటాం.. కాని టిక్కెట్‌ ఇవ్వలేదని ఏకంగా గొంతుకోసుకున్నాడు ఓ అభిమాని.. చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీనంబర్‌ 150’ సినిమా ఉదయం ఆటకు థియేటర్‌ సిబ్బంది టిక్కెట్‌ ఇవ్వలేదనే మనస్తాపంతో అందులోనే పనిచేస్తున్న ఒక యువకుడు గొంతు కోసుకున్నాడు. విశాఖకు చెందిన నాగరాజు అనే యువకుడు నగరంలోని శ్రీరామా థియేటర్‌లో పనిచేస్తున్నాడు. ఉదయం ఆటకు ఒక టిక్కెట్‌ ఇవ్వాలని థియేటర్‌ సిబ్బందిని కోరాడు. th12_south_chiru_fansఅందుకు వారు నిరాకరించడంతో అక్కడే వున్న గాజుముక్కను తీసుకుని రెండు చేతులపైనా, మెడపైన కోసుకున్నాడట… దీంతో ఆందోళన చెందిన థియేటర్‌ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని గాజుముక్కను లాగేసుకున్నారు. నాగరాజు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయడంతో వారు అక్కడకు చేరుకుని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. చిన్నపాటి గాయాలే కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అభిమానం సృతిమించితే పరిణామాలు ఇలానే ఉంటాయని ఈ సంఘటన తెలియజేస్తుంది.

“చిరు ” అభి”మానం” ..పోతోందా ..!
బాలయ్య వారసుడి ఎంట్రీ కాయమైందా..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*