బాలయ్య వారసుడి ఎంట్రీ కాయమైందా..!

Share this News:

nandamuri-balakrishna-children-son-taraka-rama-mokshagna-teja

నందమూరి బాలకృష్ణ వారసుడు సినీరంగ ప్రవేశానికి ముహుర్తం ఖరారైందా.. త్వరలో ఒక చిత్రం చేయడానికి బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా..! వారాహి చలన చిత్ర అధినేతసాయి కొర్రపాటి విశాఖ మీడియాతో మాట్లాడుతూ బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం తమ బ్యానర్‌లో తీయబోతున్నట్లు ప్రకటించేశారు.. ఇప్పటికే ఆ అంశంపై ఆయన తన హామీ ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. దీంతో ఒక్కసారి అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఎటువంటి సబ్జెక్ట్‌ nandamuri-balakrishna-children-son-taraka-rama-mokshagna-teja1ఎంచుకున్నారు.. తొలి సినిమాతో మోక్షజ్ఞని ఏ విధంగా చూపబోతున్నారు అనే అంశాలను వివరించలేదు.. ఒకవైపు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర విడుదల సంబరాల్లో ఉన్న నందమూరి అభిమానుకుల మోక్షజ్ఞ ఎంట్రీ తీపు కబురనే చెప్పాలి.. తొలిచిత్రం చేయడం ఒక మైలురాయిగా భావిస్తున్నామని… ఆరోజు ఎప్పుడు వస్తుందా అని తాను ఆతృతగా  ఎదురుచూస్తున్నాట్లు సాయి పేర్కొన్నారు. మరో వైపు బాలయ్యని పొగడ్తలతో ముంచెత్తేశారు.. తండ్రి ఎన్టీఆర్‌లా ముక్కుసూటితనం,కల్మషం లేకుండా వుంటారన్నారు. నిజాయితీకి మారుపేరు ఉంటారని.. ఆయనతో 2013 నుంచి తనకు మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ హీరోల జాబితా పెరగబోతుందనమాట.

టిక్కెట్‌ ఇవ్వలేదని గొంతు కోసుకున్నాడు!
రాహుల్‌ గాంధీకి కొత్త గుర్తింపు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*