రహస్యాలు బైట పెట్టిన సి.ఎం చంద్రబాబు

Share this News:

ncbn

ఆ విధం గా ముందుకెళ్తున్నా అనే డైలాగ్ ఎవరిదో ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు పూర్తి హక్కులు అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతాయి ..తాజాగా అయన నెల్లూరు జిల్లా చెన్నూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ తన ఆరోగ్య   రహస్యాలు బైట పెట్టి..తన అలవాట్లను మార్చుకొని ముందుకి వెళ్తున్నా అని అన్నారు .ఆరోగ్యానికి మంచివని చెప్పడంతో చేపలు,కాఫీ అలవాటు చేసుకున్న అని అన్నారు . తాను పూర్తిగా సాధారణ ఆహారం తీసుకుంటానని, అందువల్లే, తాను ఈ ఏజ్ లో కూడా ఎన్ని టెన్సన్స్ వున్నా ఆరోగ్యంగా వుండగలుగుతున్నానని చెప్పారు.

ఇలా రోజుకొక వెరైటీని మంచినీళ్లతో కలిపి ఉడకబెట్టిన దానిని తెల్లారగానే తీసుకుంటాను. రెండు కోడి గ్రుడ్లు.. అవీ కూడా పచ్చసొన లేకుండా తీసుకుంటాను. మధ్యాహ్నం కూడా సజ్జ, రాగి, జొన్నల్లో ఏమీ కలపకుండా, రెండు కూరగాయలు, కొద్దిగా పెరుగు, ఏదో ఒక పండు.సాయంత్రం పూట డ్రై ప్రూట్స్ . ఒక టీ తాగుతాను. రాత్రి పూట ఒక సూప్ గానీ, ఒక ఫ్రూట్ గానీ.నిద్రకు ముందు పాలు అని వివరిస్తూ నే …

నేను తినే తిండి మీకు దొరకదా? అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను తినే ఆహారం అందరికీ దొరుకుతుంది. కానీ, మీరు తినరు. మీరు ఆశపడతారు.. మీకు మొదటి విరోధి మీ నాలుక. కొంతమందికి సాయంత్రమైతే తాగాలని వుంటుంది. ఎక్కడ షాపు ఉంటే అక్కడికి అది మిమ్మల్ని లాక్కెళుతుంది. అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని అన్నారు

రుద్రమదేవికి పన్ను ఎందుకు ..?
మామ నటన అదుర్స్ ..నారా లోకేష్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*