A .P కి “డిజిటల్” తెచ్చిన బంగారు పతకాలు

Share this News:

award winning in e-governes

జాతీయ ఈ-గవర్నెన్స అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ మూడింటిని సాధించింది. ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ ముందున్న విషయం తెలిసిందే విశాఖలో ఈ-గవర్నెన్స జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది.ఈ సదస్సులో 20 అవార్డులు ప్రకటించగా వాటిలో 3 రాష్ట్రానికి వచ్చాయి. ఈ సందర్భంగా 12 విభాగాల్లో పనితీరు ని బట్టి కేంద్ర, రాష్ట్ర శాఖలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి, రాష్ట్ర ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవార్డులు అందజేశారు.

*గవర్నమెంట్‌ ప్రాసెస్‌ రీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏపీ రెవెన్యూ శాఖకు బంగారుపతకం లభించింది.
*బ్యాంకులు, రైతులకు ఉపయోగపడేందుకు రూపొందించిన ‘లోన చార్ట్‌ క్రియేషన ఫర్‌ బ్యాంకర్‌’కు ఈ అవార్డు దక్కింది

*ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్‌ను అనుసంధానం చేసి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినందుకు పౌర సేవల విభాగంలో ఏపీ పౌర సరఫరాల శాఖకు బంగారు పతకం లభించింది.
*నగదు రహిత లావాదేవీలకు ఆధార్‌ను అనుసంధానం చేసినందుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.బాబు రూపొందించిన యాప్‌నకు స్వర్ణపతకం లభించింది.

*ఆన్లైన్ లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో కొత్త విధానం పరిచయం చేసినందుకు గాను విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు రజత పతకం లభించింది.

రానా “ఘాజి ” ట్రైలర్ విడుదల నేడు
జగన్ బాబు డిఫరెంట్ డైలాగ్ ..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*