గౌతమి పుత్ర శాతకర్ణి : సమీక్ష

Share this News:

Gautamiputra-Satakarnis-audio-launch

సినిమా పేరు: గౌతమి పుత్ర శాతకర్ణి

రేటింగ్ : 3.5/5
తారాగ‌ణం: బాల‌కృష్ణ‌.. శ్రియ‌.. హేమ‌మాలిని.. క‌బీర్ బేడి.. శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు
సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జ్ఞాన‌శేఖ‌ర్‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
మాట‌లు: సాయిమాధ‌వ్ బుర్రా
కళ: భూపేష్ భూపతి
నిర్మాత‌లు: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్ల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌: బిబో శ్రీనివాస్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి
సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల‌:12-01-2017

సంక్రాంతి బరిలో దిగడం బాలయ్యకు కొత్తేమి కాదు.. నిలిచిన ప్రతిసారి విజయ దుందుభి మోగించడం చూసే ఉంటాం.. కాని ఈ సారి పోటీలో నిలవడం ఆషామాషీ కాదు.. ఒక వైపు సమర్థమైన పోటీ.. మరో వైపు బాలయ్య వందో చిత్రం.. అభిమానుల ఆశలు.. బరిలో నిలిచేందుకు ఉండే పోటీని సమన్వయ పరచుకుంటూ క్రిష్‌ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని గట్టెక్కించాడా లేదా.. అనేది సమీక్షిద్దాం..
కథ..
‘శరణమా.. రణమా’ అంటూ పక్క రాజ్యాలకు వర్తమానం పంపడంతో ప్రారంభమవుతోంది.. ఎదురు తిరిగిన ఆయా రాజ్యాలపై శాతకర్ణి(బాలకృష్ణ) కన్నెర్ర చూస్తూ యుద్ధానికి ముందుకు కదులుతాడు.. మొదట కల్యాణదుర్గం రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ సాగేకథ.. ఆ తరవాత బలవంతుడైన సహాపనుడి ని ఎలా ఎదుర్కొన్నాడు.. భరతఖండాల్ని ఎలా ఏకం చేశాడు.. విదేశీయుల నుంచి భరతఖండానికి ఎలా రక్షణ కవచంలా ఎలా నిలిచాడు అనేది ప్రధానంశం..
విశ్లేషణ..
చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎన్నుకోవాలంటేనే పేరున్న దర్శకులు సైతం కంగారు పడతారు.. అలాంటిది క్రిష్‌.. బాలకృష్ణ మార్కెట్‌కు మించి వందో చిత్రం ఉండేలా… తెలుగువాడి కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా వ్యాప్తి చేసిన శాతకర్ణి కథాంశం ఎంచుకుని తెరకెక్కించడంలో విజయం సాధించాడనే చెప్పాలి. ముఖ్యంగా మాటలు తూటాల్లా పేలుతూ అభిమానులతోపాటు ఒక తెలుగోడిగా పుట్టడం గర్వంగా అనిపించేలా ఉంటాయి. సాధారణ సినిమాలో వినోదం వంటి చాలా అంశాలను సులభంగా ఇరికించొచ్చు.. కాని ఇలాంటి చిత్రంలో బిగువున్న కథనంతో గంభీరంగా సాగితే బావుంటుందని దర్శకుడు భావించినట్లున్నాడు.. దానికి అనుగుణంగా శాతకర్ణి లక్ష్యాన్ని ప్రేక్షకుడి మదిలోకి ఎక్కించి అందరిని కథలో భగస్వామిగా మార్చేస్తాడు.. దేవుడి పాత్ర వేయాలంటే ఎన్టీయార్‌ తప్పా వేరొకరు సరిపోరు అన్న రీతిలో శాతకర్ణి థీరత్వానికి, హుందాతనానికి టాలీవుడ్‌లో మరో హీరోని వెతకటం సాధ్యం కాదన్నట్లుగా బాలయ్య పాత్ర పూర్తిగా ఒదదిగిపోయారు.. రౌద్రంతో కూడిన భారీ డైలాగ్స్‌ చెప్పండంలో, పౌరానిక పాత్రలో తనకుతానే సాటి అన్నట్లుగా నటవిశ్వరూపం చూపారు. అందుకే సినిమా ఆసాంతం యుద్ధం నేపథ్యంలో సాగినా ఎక్కడా విసుగు అనే భావన మదిలోకి కూడా చేరదు. క్రిష్‌ అనగానే హృదయానికి హత్తుకునే ఎన్నో సీన్లను కోరుకుంటాం.. కాని వాటిలో కొంత మేరే దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి.. శాతకర్ణి తన భార్యతో ఉన్న కొన్ని సీన్లు పండినా.. ఏదో వెలితి కనిపిస్తుంది. సినిమా అయిపోయినా అప్పుడేనా… ఇంకా ఎవైనా ఉంటే బావుండూ అని మనసు ఆరాటపడుతుంది.. కంచె వంటి చారిత్రక నేపథ్యం కథ తెరకెక్కించడంలో అనుభవం సంపాదించడంతో కళా పరంగా చాలా గొప్పగా.. చిత్రం కనిపిస్తుంది. తక్కువ రోజుల్లో సినిమా తీసినా.. విజువల్‌ ఎఫెక్ట్స్‌భారీగా వాడకున్నా రాజీ పడినట్లు అనిపించదు.. ప్రతి సన్నివేశం కనులవిందు చేస్తుంది.
ప్లస్‌ పాయింట్స్‌
+ చారిత్రక నేపథ్యం, తెలుగువాడి గౌరవం నిలబెట్టే స్థాయి కథ ఆకట్టుకుంటుంది
+ స్త్రీకున్న గొప్పతనం చాటిచెబుతూ అమ్మ విలువ తెలిసే శాతకర్ణి చెప్పే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.
+ ముఖ్యంగా ఆది నుంచి చివరి ఘట్టం దాకా అన్ని తానై బాలయ్య నడిపించిన తీరు.. ఆయన నటన అద్భుతంగా సాగుతుంది.
+ ఓడిన రాజు తల దించిన సమయంలో ‘తల దించకు అది నేను గెలిచిన తల అతి ఎత్తే ఉంచు’ అంటూ బాలకృష్ణ చేత పలికించిన అద్భుత మాటలు సినిమా ఆసాంతం ఆకట్టుకుంటాయి.
+ సహాపనుడితో చేసిన యుద్ధంలో శాతకర్ణి వ్యూహాలు ఆకట్టుకుంటూ.. ప్రధమార్ధానికి మంచి ముగింపునిస్తుంది.
మైనస్‌ పాయింట్లు
– యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఉత్కంఠ కలిగే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవ్వడంలో సంగీత దర్శకడుకు కొంత వెనకబడ్డాడు
– పతాక సన్నివేశంలోనూ జరిగే యుద్ధం తేలిపోతుంది.. ఒక్క బాలయ్య మీద భారంతోనే సాగుతున్న భావన కలుగుతుంది
– శాతకర్ణి చరిత్ర తెలియని అంశాలను తెరపై చూపిస్తా అని క్రిష్‌ చెప్పినదానిపై ఆధారపడి వెళ్లే వారికి యుద్ధాలు తప్పితే అప్పటి కాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏమీ కనిపించక నిరాశ చెందుతాడు
ఫలితం..
ఇప్పటికే చాలా చారిత్రక నేపథ్యం కథలు వచ్చినా వాటిని తమ సొంతం అనే భావన ఉండేది కాదు.. కాని శాతకర్ణి విషయంలో ఎవరికి వారు ఓన్‌ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అందులో బాలయ్య నటన, క్రిష్‌ అప్పటి పరిస్థితులనేపథ్యం చూపడం, భార్య భర్తల అనుబంధం, అమ్మపై చూపే అనురాగం వంటి అంశాలు కుటుంబ ప్రేక్షకులను కట్టిపారేస్తాయి.. దాంతో ఈ సంక్రాంతికి బాలయ్య మరోసారి విజయదుందుభి మోగించడం కాయం… కాసుల విషయం ఎలా ఉన్నా తెలుగు వాడి సత్తా రాజమౌళి కళానైపుణ్యంతో ఎక్కడికో తీసుకెళితే క్రిష్‌ మాత్రం తన ప్రతిభతో ఆ ప్రభను కొనసాగించాడనంలో సందేహం లేదు.
‘తెలుగు వాడి ఘన చరిత్రకు అద్దం’
– శ్రీ

పులివెందుల వస్తా.. ముట్టుకొనే దమ్ముందా ..? జే. సీ
గౌతమి పుత్ర సినిమా చూస్తున్న టీం జిపిఎస్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*