జూబ్లీహిల్స్ కాంగ్రెస్ దే: ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా

admin
Published by Admin — November 12, 2025 in Telangana
News Image

తెలంగాణలో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. పెద్ద ఎత్తున దీనిపై ప్ర‌చారం కూడా జ‌రిగింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా.. బీఆర్ ఎస్ నాయ‌కు లు, బీజేపీకి చెందిన కేంద్ర‌మంత్రులు కూడా ఇక్క‌డ ప్ర‌చార హోరునుకొన‌సాగించారు.విజ‌యంవిష‌యంలో ఎవ‌రి ధీమా వారు వ్య‌క్తంచేశారు. ఇక‌, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు కూడా వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ఆశించిన‌విధంగా జ‌ర‌గ‌లేదనే చెప్పాలి.

క‌నీసం 60 శాతం ఓట్లు కూడా పోలింగ్ కాలేదు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యానికి 49.8 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. అప్ప‌టికే లైన్‌లో ఉన్న‌వారికి ఓటు వేసుకునే అవ‌కాశం క‌ల్పించినా.. 55 శాతానికి మించే ప‌రిస్థితి లేదు. ఇక‌, ప్ర‌జ‌ల నాడిని బ‌ట్టి ప‌లు సంస్థ‌లు ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడుతార‌న్న విష‌యాల‌పై విశ్లేష‌ణ చేశాయి. అధికార పార్టీ దూకుడు క‌నిపించిన‌ట్టు ఎన్నిక‌ల విశ్లేష‌కులు తెలిపారు. అయితే.. పోరు మాత్రం హోరా హోరీగానే సాగిన‌ట్టు తెలిపాయి. అయిన‌ప్ప‌టికీ.. త‌క్కువ మెజారిటీతో అయినా కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశంఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు చెబుతున్నాయి.

ఎవ‌రెవ‌రు ఏం చెప్పారంటే..

ప‌బ్లిక్ ప‌ల్స్‌:  కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు 48 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి సునీత‌కు 41 శాతం.
నాగ‌న్న స‌ర్వే:  బీజేపీకి 11.5 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 47.47 శాతం, బీఆర్ ఎస్‌కు 41.1 శాతం.
స్మార్ట్ పోల్: కాంగ్రెస్ 48.2 శాతం, బీఆర్ఎస్ 41.1 శాతం ఓట్లు
చాణక్య స్ట్రాటజీ: కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు

Tags
Jubilee Hills By-Election congress brs exit polls congress win
Recent Comments
Leave a Comment

Related News