సమాజంలో పెద్దగా ఆశలు లేని కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి పేద కుటుంబాలేనని అంటా రు. వారికి ఏదైనా పని.. ఉండేందుకు కాస్త సొంతిల్లు చూపిస్తే.. ఇంతకుమించి వారు మరేమీ కోరుకునేది కూడా ప్రత్యేకంగా ఉండదు. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఇంటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయి తే.. కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు ఒక అడుగు ముందు.. రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నా యి. నిధుల కొరతతో పాటు.. భూముల సమస్య కూడా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కానీ, ఏపీలో ఇప్పటి వరకు 2014-19 మధ్య టీడీపీ, 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం. అయితే.. ఏ ప్రభుత్వానికి తగిన విధంగా ఆ ప్రభుత్వం విధా నాలను అమలు చేసింది. టీడీపీ హయాంలో టిడ్కో నివాసాలను నిర్మించి కొందరికి ఇచ్చారు. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ సొంత జాగా ఇచ్చింది. అక్కడే నిర్మించుకునేందుకు(ఇండివిడ్యు
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి.. గత తమ పాలనలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లడంతోపాటు.. అప్పటికే పూర్తయి.. లబ్ధి దారులకు ఇంకా ఇవ్వని వైసీపీ హయాంలో చేపట్టిన ఇండివిడ్యువల్ ఫ్లాట్లనుకూడా పూర్తి చేయించింది. ఇలా .. మొత్తం 3 లక్షల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా.. గత ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు నేడు తక్కువగా ఉన్నాయి. కానీ, చంద్రబాబు భేషజాలకు పోకుండా.. పేదలకు న్యాయం చేసేందుకు చూశారు.
ఈ క్రమంలో ఇటు టిడ్కో, అటు జగనన్న నివాసాల్లో కూడా బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు జరి గాయి. 3 లక్షల 192 ఇళ్లలో పేదలకు ఒకేసారి అధికారులు పట్టాలు, ఇంటి తాళాలను కూడా అందించారు. ఈ పరిణామం.. చంద్రబాబును పేదల హృదయాల్లో గూడు కట్టుకునేలా చేసిందనడంలో సందేహం లేదు. వచ్చే ఉగాదికి మరిన్ని ఇళ్లు కట్టిస్తామని కూడా చంద్రబాబు పేర్కొనడం పేదల సొంతింటి కల సాకారానికి పునాది వేసేలా చేసింది.