ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్(వాలంటరీ రిటైర్డ్) అధికారి ప్రవీణ్ ప్రకాష్.. తాజా గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తనలో 2.0 ప్రవీణ్ ప్రకాష్ ను చూస్తారని వ్యాఖ్యానించారు. తన కెరీర్‌లో అనేక మంది తన నిర్ణయాలతో ఇబ్బందులు పడ్డారని.. వారందరికీ తాను క్షమాపణలు చెబుతున్నాన్నారు. అయితే.. తాను తీసుకున్న నిర్ణయాలు తన వ్యక్తిగతం కాదని తెలిపిన ఆయన.. `కొందరి కోసం` అలా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే.. ఈ విషయం చట్టబద్ధంగా ఉన్న తన పదవి నుంచి జరిగిన విషయాన్ని గుర్తించాలని సూచించారు.
ఇకపై తాను అన్ని విషయాలను పంచుకుంటానని.. చెప్పారు. ``ఇప్పుడు నేను ఐఏఎస్ కాకపోయినా.. మ రో లైఫ్‌ను విజయవంతంగా లీడ్ చేయాలని భావిస్తున్నాను. అందుకే 2.0 కెరీర్‌లో నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తాను. అందుకే.. ఇక నుంచి అన్ని విషయాలు చెబుతాను.`` అని వ్యాఖ్యానించారు. తాను ఏం చేసినా.. వ్యక్తిగత మని కొందరు ట్రోల్స్ చేశారన్న ప్రవీణ్ ప్రకాష్.. కెరీర్‌లో ఎప్పుడూ తను వ్యక్తిగతం కోసం పాకులాడలేదన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు సమ్మిళితంగా ఆయన చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.