ప‌బ్లిక్‌గా ర‌ష్మికను కిస్ చేసిన‌ విజ‌య్‌.. ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్‌!

admin
Published by Admin — November 13, 2025 in Movies
News Image

`ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య‌వంతం అయింది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం తాజాగా హైద‌రాబాద్‌లో స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. విజయ్ ఎంట్రీతోనే ఆడిటోరియం ఉత్సాహభరితంగా మారింది.

అయితే ఈవెంట్ లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. స్టేజ్‌పైన‌ రష్మిక చేతిపై విజ‌య్ దేవ‌ర‌కొండ కిస్ చేశాడు. ఆ సన్నివేశం చూసిన అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రష్మిక సిగ్గుతో బ్లష్ అవ్వడం, నవ్వుతూ రియాక్ట్ కావడం ఆ క్షణాన్ని మరింత మధురంగా మార్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ సృష్టిస్తోంది. 

విజయ్-రష్మిక రిలేషన్ అనేది ఇక ఓపెన్ సీక్రెట్‌. వీరిద్దరూ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సక్సెస్ మీట్‌లో చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ మూమెంట్‌తో వారి బంధం గురించి అభిమానులకు మరింత స్పష్టత వచ్చేసింది.

స‌క్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. `రష్మికలో తెలియని అమాయకత్వం ఉంది. సెట్‌లో అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ లాంటి బలమైన కథలను ఎంచుకునే స్థాయికి చేరడం గర్వంగా ఉంది. రషి.. నువ్వు నిజంగా ఒక అమేజింగ్ ఉమెన్` అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. మ‌రోవైపు ర‌ష్మిక సైతం విజ‌య్ ప‌ట్ల త‌న భావోద్వేగాన్ని దాచ‌లేక‌పోయింది. `మనలైఫ్‌లో విజయ్‌లాంటి వ్యక్తి ఉండటం ఒక వరం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉండాలి` అని చెప్పి అభిమానులను ఆకట్టుకుంది.

 

Vijay Devarakonda kissing Rashmika Mandanna’s hand — the cutest moment on the internet today! 🥰💫#VijayDevarakonda #RashmikaMandanna #CutestPair #VijayRashmika #TheGirlFriend #girlfriend #rashmika pic.twitter.com/qq5fE1Ppwv

— 𝐕𝐢𝐠𝐧𝐞𝐬𝐡 🚩 (@vignesh__9) November 12, 2025 ">

 

Tags
Vijay Deverakonda Rashmika Mandanna The Girlfriend Tollywood Latest News
Recent Comments
Leave a Comment

Related News