రాజకీయంగా విభేదించవచ్చు.. కానీ పనితీరులో మాత్రం చంద్రబాబును విభేదించే నాయకులు ఎవరూ లేరు. కరడు గట్టిన వ్యతిరేకులు కూడా చంద్రబాబు పనితీరును ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తెలంగాణ నాయకులే ఉదాహరణ. ఒకప్పుడు ఆయనతో పనిచేసి.. తర్వాత విభేదించిన వారు కూడా.. చంద్రబాబు పనితీరుకుఎలాంటి వంకలు పెట్టలేదు. దీనికి కారణం.. చంద్రబాబు హార్డ్ వర్క్. విజన్. ఈ రెండు ఆయనకు ఇప్పటికీ పెట్టని ఆభరణాలుగా మారుతున్నాయి.
కానీ.. ఈ విషయాన్ని వైసీపీ అధినేతజగన్ గ్రహించలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. `క్రెడిట్ చోరీ` పేరుతో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు.. చంద్రబాబును కార్నర్ చేస్తున్న తీరు.. వంటివి విస్మయానికి గురి చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం ఏముం టుందన్నది ప్రశ్న. ఏ ప్రభుత్వమైనా.. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో మంచిది ఉంటే దానిని కొనసాగిస్తుంది. అలాంటప్పుడు.. క్రెడిట్ చోరీ అనే మాటే రాదు.
అలా అనుకుంటే.. చంద్రబాబు హయాంలో బీజం వేసుకున్న హైదరాబాద్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే, శంషాబాద్ విమానాశ్రయం వంటివాటిని తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొనసాగించింది. వీటిని పూర్తి చేసింది. దీంతో తమకు నచ్చిన పేర్లనే వాటికి పెట్టుకున్నారు. ఇది తమ ఘనతేనని కూడా చెప్పుకొచ్చారు. అలాగని వైఎస్ క్రెడిట్ చోరీ చేశారని చంద్రబాబు అంటే బాగుంటుందా? అలా ఆయన అనలేదు.. కూడా.. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ.
కొందరు బీజం వేస్తారు. కుదిరితే పూర్తి చేస్తారు. లేకపోతే.. తదుపరి వచ్చే ప్రభుత్వాలు.. వాటిని పూర్తి చేస్తా యి. ఇది సైక్లింగ్ విధానంలో జరిగే డెవలప్ మెంట్. అంతేకాదు.. ఒకరు చేసిన పని వారికే దక్కాలని అం టే.. ఇది ప్రజాస్వామ్యం. అలా జరగకపోవచ్చు. పైగా చంద్రబాబు దేశ , విదేశాలు తిరిగి మరీ పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఈ విషయం జగన్‌కు కనిపించకపోయినా.. ప్రజలకు కనిపిస్తోంది. సో.. క్రెడిట్ చోరీ చేస్తున్నారన్న వాదన సరైంది కాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అభివృద్ధిలో ఎవరి కష్టం వారిది. ఒకరు తొందరగా పుంజుకుంటారు. ఈ పరంపరలో చంద్రబాబు ముందున్నారు. అంతే.. !