బాలయ్య వీడియోలు వైరల్

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా వార్తాంశమే. ఆయన బయటికి వచ్చాడంటే ఏదో ఒకటి చేయకుండా వెళ్లడు. ఆ మధ్య ‘నర్తనశాల’ సినిమా ఫుటేజ్ ఆన్ లైన్లో రిలీజ్ చేసిన టైంలో కొన్ని రోజులు హడావుడి చేసిన బాలయ్య.. ఆ తర్వాత విరామం తీసుకున్నారు.

ఇప్పుడు ‘సెహరి’ అనే కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం కోసం బయటికొచ్చిన ఆయన.. ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. సంబంధిత వీడియోలు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ రాకపోవచ్చన్న కామెంట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఆ సంగతలా ఉంచితే..  మరో వీడియోలో బాలయ్య మార్కు చేష్టలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్ర బృందంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బాలయ్యను ఒక్కసారి పిలిస్తే వచ్చేశారంటూ ఆయన్ని అంకుల్ అని సంబోధించాడు. వెంటనే బాలయ్య కోపంగా అతడి వైపు చూశాడు. అతను తమాయించుకుని బాలయ్య గారు అన్నాడు.

తర్వాత ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నపుడు పక్కనే ఉన్న హీరో దాని మీద చెయ్యి వెయ్యబోతే ఫట్‌మని కొట్టేశాడు బాలయ్య. ఇక ఈ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి ముందు తన మొబైల్ రింగ్ అయితే ప్యాంటు జేబులోంచి బయటికి తీసి.. ఇలా చూసి అవతలికి విసిరేశాడాయన. దీంతో స్టేజ్ మీద ఉన్న వాళ్లందరూ అవాక్కయ్యారు.

ఈ వీడియోలన్నీ చూసి బాలయ్య తో మర్యాదగానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటూ వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. సంబంధిత వీడియోలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లోనే కాక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతూ మంచి వినోదాన్నే అందిస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.