బ్రేకింగ్ న్యూస్-'తానా'ఎన్నికల గందరగోళం-'రవి పొట్లూరి'కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..

మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న 'తానా'ఎన్నికల సమరభేరి 'రవి పొట్లూరి' కూడ  ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది. ప్రస్తుత 'తానా 'కార్యదర్శి అయిన 'రవి పొట్లూరి' స్వయంగా ఈ విషయాన్ని 'నమస్తే ఆంధ్ర'తో చెప్పి,అమెరికా వ్యాప్తంగా అనేకమంది తో పరిచయాలు అనుచర గణం ఉందని  కార్యదర్శినైన తనకే ఈ పోటీకు ప్రధాన అర్హత కూడా అని చెప్పారు.ఒకటి రెండు రోజుల్లో బహిరంగంగా కూడా ప్రకటిస్తూ, కార్యాచరణ తెలియచేస్తానని చెప్పారు.
నామినేషన్ల టైం కూడ రాకుండానే అనేక ఉద్రిక్త పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 'నిరంజన్ శృంగవరపు' చెప్పుకుంటున్న లక్ష డాలర్స్  భూరి విరాళము వివరాలు కావాలనే  డిమాండ్ 'నరేన్ కొడాలి'వర్గం నుంచి మూడు పబ్లిక్ వీడియో మెసేజ్ ల  ద్వారా రాగా ,ఇప్పటి వరకు ఎటువంటి వివరణ 'నిరంజన్ శృంగవరపు'ఇవ్వలేదు.నిజానికి ఆ విరాళము ఆయనది కాదని,ఆయనకు ఎటువంటి సంబంధం లేదని,ఒక ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ నుంచి వచ్చిందని రెండవ వర్గం వారు చెప్తున్నారు.అదే నిజమైతే ఈ విషయం మూలంగా కొన్నివిపత్కర పరిణామాలు 'తానా 'పరంగా గాని, ఆ కంపెనీ ఉద్యోగులకు గాని, మరేదైనా గాని సంభవించవచ్చు.అటువంటిదేదీ లేదని ఆశిస్తూ ,ఈ విషయం సమాచారం కొత్తగా మారితే తెలియచేస్తాం.అటు 'నరేన్ కొడాలి'వర్గం ముఖ్య నాయకులు దేశవ్యాప్తం గా మద్దతుకై చేసిన ప్రయత్నాలు కలగా పులగంగా ఉన్నందున, ఎందుకైనా మంచిదని 'నిరంజన్ శృంగవరపు'వర్గంతో పోటీ నివారణ ఫార్ములాల పై పయత్నాలు చేసినట్లు,ఆ పరిణామాల పై ఇప్పటికే అసంతృప్తి గా ఉన్న'రవి పొట్లూరి' ఆవేశానికి గురై ,తానే పోటీ చేస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది.అత్యంత ముఖ్యుడైన ఈయన కోపగిస్తే పరిస్థితి మరింత జటిలమవుతుందని ఆయనను బుజ్జగించడానికి 'నరేన్ కొడాలి'వర్గ ప్రముఖుడైన డీసీ నాయకుడు 'రవి పొట్లూరి' నివసించే ప్రదేశానికి వెళ్లినట్లు పక్కా సమాచారం.ఈ రెండు వర్గాల గొడవలతో సంబంధం లేని, పోటీ పై ఖచ్చితమైన నిర్ణయంతో  'శ్రీనివాస గోగినేని 'వర్గం తమదైన విధానంతో మద్దతు పెంచుకుంటూ సాగిపోతున్నారు.వెరసి రాబోయే రెండు మూడు రోజుల్లో ఏమైనా జరగవచ్చునని భావించవచ్చు.
క్రితం ఆర్టికల్ లో ఉదహరించిన పాట మీ కోసం మరొక్క సారి
'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? కంచెయే తానుగా చేను మేసినా కాదనువారెవరూ? ఏ  నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?'
‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.