కేసీఆర్ కి భారీ షాక్

GHMC లో వరద సాయాన్ని బంద్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వరద బాధితులకు ఇస్తున్న పదివేల సాయాన్ని వెంటనే ఆపేయాలంది. దరఖాస్తులు కూడా స్వీకరించొద్దు అని చెప్పింది.

GHMC elections కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇది ఎన్నికలపై ప్రభావం చూపుతుందని వెంటనే దీనిని నిలిపేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు తీసుకున్న వరద బాధితుల దరఖాస్తులకు కూడా డబ్బులు ఇవ్వొద్దని ఆదేశించింది.

డిసెంబరు 4వ తేదీ ఫలితాలు వచ్చిన అనంతరం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. అంతవరకు దీనికి సంబంధించిన అన్ని పనులు ఆపేయాలని ఆదేశించింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.