ట్విట్ట‌ర్ జ‌పం చేసే నువ్వా నీతులు చెప్పేది? 'సాయి రెడ్డి'కి 'బుచ్చి రామ్ ‌ప్ర‌సాద్' కౌంట‌ర్‌

NRI

నిత్యం ట్విట్ట‌ర్‌లో ఉంటూ, వాళ్ల మీద వీళ్ల మీద పిట్ట క‌బుర్ల‌తో పొద్దు పుచ్చే నువ్వా,  టీడీపీకి వంక‌లు పెట్టే ది అని వైసీపీ ఎంపీ విజ‌య'సాయి రెడ్డి'పై తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్ర‌ట‌రీ 'బుచ్చి రామ్ ప్ర‌సాద్' విమ‌ర్శ‌లు గుప్పించారు.తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మం త్రి నారా లోకేష్‌ల‌ను ఉద్దేశించి సాయి రెడ్డి చేసిన ట్వీట్‌పై ఘాటుగా స్పందించా రు.కొడుకు ట్విట్ట‌ర్‌లో, తండ్రి జూమ్‌లో,  అంటూ సాయి రెడ్డి చేసిన కామెంట్ల‌ను రామ్ ప్ర‌సాద్ ఖండించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, లోకేశ్‌లు ఏం చేస్తున్నారో నీకు క‌నిపించ‌డం లేదా సాయి రెడ్డీ అని నిల‌దీ శారు. నివ‌ర్ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో నిత్యం లోకేష్ ప‌ర్య‌టిస్తున్నా, రైతుల విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న అనాలోచిత‌, నిరంకుశ‌త్వ తీరును ఎండ‌గ‌డుతున్నా, నీకు వినిపించ‌లేదా? అయినా మీది దున్న‌పోతు ప్ర‌భుత్వ‌మ‌ని మా నాయ‌కులు ఊరికేనే అన‌డం లేదు అని విరుచుకు ప డ్డారు. నివ‌ర్ తుఫాను బాధితుల‌కు లోకేష్ అండ‌గా నిలుస్తున్నార‌ని, పార్టీ త‌ర‌ఫున వారికి అన్ని విధాలా ధైర్యం క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు.

అదేస‌మ‌యంలో నివ‌ర్ తుఫాను వ‌ల్ల క‌లిగిన నష్టానికి ప‌రిహారంగా ఎక‌రానికి 30 వేల చొప్పున ఇవ్వాల‌ని లోకేష్ డిమాండ్ చేస్తున్నార‌ని, ఈ విష‌యాల‌న్నీ తెలిసి కూడా తెలియ‌న‌ట్టు నాట‌కం ఆట‌కం ఆడుతున్నారా?  లేక, ప్ర‌జ‌ల మెప్పుకోసం సూర్యుడి ముఖాన ఉమ్మేసిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? ఒక వేళ అదే నిజ‌మైతే, అది మీ ముఖానే ప‌డుతుంద‌న్న వాస్త‌వాన్ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. సాయి రెడ్డి ఏనాడైనా ప్ర‌జ‌ల్లో కి వ‌చ్చారా? అని ప్ర‌శ్నించారు.

మీ నాయ‌కుడు జ‌గ‌న్ ఎంచుకున్న ప్రాంతాల్లో త‌ప్ప, ఎక్క‌డా స‌భ పెట్ట‌డం లేదు, కానీ, లోకేష్ అన్ని ప్రాంతాల్లోనూ క‌లియ‌దిరుగుతున్నారు. ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ‌కు తానున్నానంటూ వెళ్తున్నారు. బాధితుల త‌ర‌ఫున ఎక్క‌డికక్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు. మీ ప్ర‌భుత్వ దాష్టీకానికి కుటుంబాల‌కు కుటుంబాలే రోడ్డున ప‌డుతున్నాయి. రాజ‌ధానిలో రైతులు అలోల‌క్ష్మ‌ణా అంటూ రోదిస్తున్నా, ప‌ట్టించుకోకుండా ఉన్న‌ది మీరే.మా నాయ‌కులు  మీలాగా మాత్రం కాదు అని బుచ్చి రామ్ ప్ర‌సాద్ సాయి రెడ్డి పై మండిప‌డ్డారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.