చికాగో ఆంధ్ర సంఘం నిర్వహించిన "పల్లె సంబరాలు" కార్యక్రమ నివేదిక

NRI
చికాగో ఆంధ్రసంఘం  జనవరి 9, 2021 న నిర్వహించిన"పల్లె సంబరాలు" చలిని, 'కోవిడ్ వలన ఏర్పడిన స్తబ్దత ని చీల్చి చెండాడుతూ, 3  గంటలు నిర్విరామంగా వినోదాల జల్లులు కురిపించాయి. చికాగో ఆంధ్ర సంఘం వారి పేస్ బుక్ పుట ద్వారా మరియు 'టి.వి. ఆసియా తెలుగు'  ఛానెల్, ఈ కాల్పనిక కారక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసారు. 'కోవిడ్' మహమ్మారి కారణంగా ఎవరి గృహాలకు వారు పరిమితమవుతున్న పరిస్థితుల్లో,  వీక్షకులు ఈ కారక్రమాన్ని 'థియేటర్' లో  ప్రత్యేక్షంగా చూసినదాని కన్నా మిన్నగా  ఆనందానుభూతిని పొందడంలో  ఈ సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణా బృందం  కృతకృత్యులయ్యారు.
ముందుగా దీప ప్రజ్వలన, తదుపరి  పూర్వ అధ్యక్షుని సత్కారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి.  శ్రీమతులు జ్యోతి వంగర మరియు అన్విత పంచాగ్నుల సూత్రధారులు గా వ్యవహరిస్తూ  కార్యక్రమాన్ని  ఆద్యంతం రక్తికట్టించారు. ముద్దులొలికే చిన్నారులు సాగరిక, కావ్య  మరియు అమృత  విఘ్నేశ్వర ప్రార్ధనతో ఈ వినోద కార్యక్రమంనిరంతరాయంగా సాగడానికి దోహదంచేసారు.
చిరంజీవి సాకేత్ మంత్రవాది  బాలకాండ శ్లోకాలను మధురంగా గానం చేయగా, మూడు సంవత్సరాల 'రుద్ర నేతి'   'ముత్తుస్వామి దీక్షితార్’ వారి కీర్తన  పాడి  వీక్షకుల ముద్దులను మూటగట్టుకొని  సాగింది.  చిన్నారులు ఇషాన్, ఇషిక, సరయూ మరియు కావ్య 'ఛాంగుభళా',అనే తెలుగు పాటను, 'క్రేజీ ఫీలింగ్' అనే 'పాప్ సాంగ్' నీ పాడి  సాంప్రదాయం, ఆధునికతలను అనుసంధానించారు. ఆ విధంగా సంక్రాంతి పండుగలోని ఆనందాన్ని ముందుగానే మనకు పంచి, వీక్షకులను ఉత్తేజ పరిచి, తదుపరి కార్యక్రమాల పట్ల ఉత్కంఠను రేకెత్తిచారు.  చిరంజీవి శ్రావణి తెల్లాప్రగడ సమకూర్చిన 'స్పెషల్ ఎఫెక్ట్స్'  అద్భుతమనిపించాయి.
చలనచిత్ర గీతాలు, సంప్రదాయ మరియు జానపద గీతాల మేలు కలయికతో రూపు దిద్దుకొన్న ఈ కార్య క్రమాలన్నీతెలుగు ప్రజలవిభిన్న సంస్కృతులకు అద్దంపట్టాయి. 'కూచిపూడి నాట్య నిలయం' విద్యార్థులు ప్రదర్శించిన "చక్కని తల్లికి ఛాంగు భళా"  అనే గేయ రూపకం తెలుగు వారి ప్రాచీన సాంప్రదాయ విశిష్టతనుమన ముందు ఆవిష్కరింపచేసింది.
శ్రీమతి వాసంతి అయ్యర్  శిష్యులు  వివిధ నగరాలనుంచి విశిష్ట సాంకేతికత, అతుత్తమ సమన్వయము తో వీడియో ద్వారా సమర్పించిన  అన్నమాచార్య కీర్తన గాయనీ, గాయకులందరూఒకే వేదికపై నుండి పాడరా అన్న అనుభూతిని కలుగచేసింది.  సోదరి, సోదరులు వైష్ణవి, వైభవ్ 'మాయా బజార్' లోని 'అహ నా పెళ్ళంట'  పాటకి ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకొంది.
అక్షయపొట్లూరి ప్రదర్శించిన :జింగిల్ బెల్స్" నృత్యం భారతీయ, పాశ్చాత్య పోకడల సమ్మేళనంతో మామూలు కు భిన్నంగా వైవిధ్యతనుచాటింది.  "పల్లె సంబరాలు" కార్యక్రమ మూలాంశమైన గ్రామీణ, జానపద  వినోదాల నేపధ్యానికి , రంగడి (ఆనిమేటెడ్ పాత్ర) ప్రవేశంతో మంచి ఊపు లభించింది.
దర్భా సోదరీమణులు పాడిన 'సంక్రాంతి గొబ్బిళ్ళ పాట' సొంపుగా ఉంటె, ఆంధ్ర ప్రదేశ్ కళాకారులు హరిదాసుల 'ఆశీర్వాదాలను', అందరికీ అందించి, ధనుర్మాసపు సంప్ర దాయాలను విశద పర్చారు. విశేషించి తెలుగునాట ప్రతిగ్రామంలో సంక్రాంతికి తప్పకదర్శనమిచ్చే, మరియు సంక్రాంతి వినోదాలకు పట్టు కొమ్మ అయిన 'పిట్టల దొరలు' అందించిన హాస్యం, వారు పంచిన ఆహ్లాదం మర్చి పోలేము. పిట్టల దొరలుగా అభినయించిన కళాకారులిద్దరూ అద్భుతంగా పాత్రపోషణ చేసారు.
సంక్రాంతి గీతానికి శ్రీమతి ప్రశాంతి తాడేపల్లి కూర్చిన నృత్యాన్ని చిరంజీవులు సమన్వి, లాస్య, అనన్య చక్కగా అభినయించి కనువిందు చేయగా, 'తురిమెళ్ళ సోదరీమణులు ప్రదర్శించిన 'శరణం భవ'  కూచిపూడి నృత్యం  పరిపూర్ణతకు, అభినయ కౌశలానికి అద్దం పట్టింది.
ఇంకా, యువతీమణులు , హ్హాసిని, గాయత్రి "భోగి పండుగ" విశిష్టతనుఆకర్షణీయంగా చక్కని నృత్యం ద్వారా వివరించారు. 26 మంది మహిళా మణులు  పాల్గొన్న సంక్రాంతి ముగ్గుల వీడియో ప్రదర్శన  అందరినీ అబ్బుర పరచి, పల్లె సంబరాల కారక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలచింది. చికాగో ఆంధ్రా వారి ప్రత్యేక బహుమతిగా Covid నిబంధనలను పాటిస్తూ తమ సభ్యులందరికీ సంక్రాంతి సందర్బంగా పండగ పిండివంటలు, CAA వారి తెలుగు Calender ను కూడా ఇంటింటికీ అంద జేశారు. చికాగో ఆంధ్ర సంఘం చైర్మన్ శ్రీ.సుందర్ దిట్టకవి 2021 సంవత్సరానికి అధక్షుడిగా ఎన్నికైన  శ్రీ.శైలేష్ మద్ది గారిని పరిచయం చేసారు. శ్రీ శైలేష్ మద్ది  చికాగో ఆంధ్ర సంఘం సభ్యులతో సంభాషించారు, పిదప కార్య నిర్వాహక వర్గాన్ని అందరికి పరిచయం చేసారు.
కూచిపూడి నాట్యనిలయం, ఏలూరు వారు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యనాటిక 'గంగావతరణం'  వీక్షకులకు కనువిందు చేసింది. శ్రీమతి దీప రవి సృజనాత్మక మైన 'అనిమేషన్ టెక్నాలజీ' అందించారు. గురు శ్రీమతి స్వర్ణలత బెండాది  కూర్చిన  నృత్యాలు ఆన్ లైన్ వీక్షకుల నుండి  ప్రశంసలతో బాటు,  వ్యాఖ్యల వర్షం కురిపించాయి. శ్రీమతులు సుందరవల్లి, వాణి దిట్టకవి అందించిన కాన్సెప్ట్, శ్రీ సుందర్ దిట్టకవి కార్యక్రమ వ్యాఖ్యలు అసంఖ్యాక ఆన్ లైన్ వీక్షకుల ప్రశంసలు పొందాయి.
ప్రముఖ సంగీతజ్ఞులు  సర్వశ్రీ శివ ప్రసాద్ (ఈలపాట), మేడూరి శ్రీనివాస్(వీణ వాద్యం) కృష్ణ తేజస్వి (గాయకులు), రామనాధ్ కందాళై (కవి),  ప్రమతి  కందాళై"అర్పించిన  బాలు గారి పాటల నివాళి" ఉద్విగ్నతను కలిగించగా,  తెరపై వినిపించిన బాలు గారి ' "సహజ స్వరం, గళం' వీక్షకులను ఉద్వేగం తో కదిలించాయి.
"మా తెలుగు తల్లికి మల్లెపూదండ" పాటకి సీనియర్ సిటిజన్స్ అభినయ ప్రదర్శన మొత్తం కారక్రమానికి హై లైట్ గా నిలిచింది  ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ ఏ.ఆర్. రెహ్మాన్ పాటలతో సి.ఏ.ఏ. మహిళా బృందం ప్రదర్శించిన  "రెహ్మాన్ రిథమ్"  ప్రత్యేక ఆకర్షణ కాగా, చైత్య , శ్రావణి ల వీడియో కూర్పు, శ్రీమతి  సుచి కోఆర్డినేషన్ ప్రతేకంగా  చెప్పుకోవాలి.  ఈ పాట రాబోయే 'భారత రిపబ్లిక్ డే " వీక్షకులకు గుర్తు చేస్తూ దేశ భక్తి పూరితంగా ముగిసింది.
శివ, శైలేష్  మద్ది & సురేష్ గారలు హుషారైన సినీ గీతాలకు చేసిన నృత్యాభినయం  వీక్షకులకు గిలిగింతలు పెట్టింది. చికాగో ఆంధ్ర సంఘం చేపట్టిన సేవ, ధార్మిక కార్య క్రమాలను, సేవా విభాగపు సంచాలకులు శ్రీ రాజ్ పొట్లూరి సందేశాత్మకంగా వివరించారు. సి.ఏ.ఏ. వారి సేవా నిరతి,తాడేపల్లి గూడెం బుర్రకథ కళాకారులు గుండెలకు హత్తుకునేలా బుర్రకథ ద్వారా వివరించారు.  సేంద్రియ వ్యవసాయ రీతులు,  రైతుల స్థితిగతులను కార్యక్రమంలో చివరిఅంశ మైన మరొక బుర్రకథ వివరించింది.
టి .వి  ఆసియా తెలుగు వారు ఈ కారక్రమాన్ని ప్రసారం చేయటాన్ని వ్యాఖ్యాతలు ఎంతగానో అభినందించగా, చికాగో ఆంధ్ర సంఘం  కార్యదర్శి శ్రీ అద్దంకి గౌరీ శంకర్ వందన సమర్పణ తెలియ చేసారు. చిరంజీవి అనికా కారుమూరి జాతీయగీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.
కొస మెరుపు: ఇంత వైవిధ్య భరిత కారక్రమం, మూడు గంటలు వీక్షకులను కదలనీయకుండా కట్టిపడేసి, వినోదాన్ని, ఆహ్లాదాన్ని పుష్కలంగా  పంచి, ఉత్తమ సాంస్కృతికకార్యక్రమంగా మన హృదయాలలో నిలిచి పోయింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.