ఢిల్లీలో రైతులపై కఠినంగా లాఠీ ఛార్జ్
మోడీ సాబ్ నీ పతనానికి రోజులు దగ్గర పడ్డాయి...మీరు ఎంత హింసించిన సరే రైతులు వెనకడుగు వేయరు...దేశం మొత్తం రైతుల వెంట ఉన్నారు...#BJPHataoDeshBachao#FarmersProtest @INCTelangana @UttamTPCC @revanth_anumula @KVishReddy @VamsiChandReddy @djohninc @ShivaSenaIYC @VenkatBalmoor pic.twitter.com/ItDAFdEYj1
— Kerelly Karunakar Reddy (@KarunakarINC) January 26, 2021
కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గణతంత్ర పరేడ్ పేరిట నేడు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల శాంతియుత పోరాటంపై మోడీ సర్కారు ఆగ్రహం వ్యక్తంచేసింది. లాఠీలతో కాఠిన్యంగా ప్రవర్తించి వారిని చితక్కొట్టింది. కొన్ని గంటల కిందట భారత రిపబ్లిక్ వేడుకలతో మురిసిన ఎర్రకోట ఇప్పుడు రైతుల నిరసనలకు వేదికగా మారింది. ఈ క్రమంలో నగరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని మరీ ముందుకు ఉరికిన రైతులు ఎర్రకోటపైకి చేరారు.
రైతులు, రైతు సంఘాల నాయకుల నినాదాలతో ఎర్రకోట పరిసరాలు మార్మోగాయి. రైతులు ఎర్రకోట ప్రాంగణంలో జెండా ఎగురవేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగురవేసే స్తంభం నుంచే తమ జెండాను కూడా ఎగురవేశారు. ఇలాంటి పరిణామం స్వతంత్ర దేశంలో తొలిసారి.
ఎర్రకోట పరిసరాల్లో ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, వాటిపై రైతులే దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే ట్రాక్టర్లతో దూసుకొచ్చిన రైతుల ధాటికి పోలీసులు వెనుకంజ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ఐటీవో నుంచి ఎర్రకోట చేరుకున్నట్టు అర్థమవుతోంది.
అన్నం పెట్టే రైతులపై దాడి అమానుషం... ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలి....అమిత్ షా జోడి పతనానికి ఇది నాంది.#IndiaWithFarmers pic.twitter.com/F1td6my2Jj
— Revanth Reddy (@revanth_anumula) January 26, 2021