గుజరాత్ లో దుమ్ములేపిన కేజ్రీవాల్ పార్టీ, MIM బోణీ

ప్ర‌ధాన మంత్రి, బీజేపీ కీల‌క‌నాయ‌కుడు న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో.. మ‌న హైద‌రాబాద్‌కు చెందిన మ‌జ్లిస్ పార్టీ.... ఎంఐఎం.. పాగా వేసింది. ఇది బోణీనే అయిన‌ప్ప‌టికీ.. హోరా హోరీగా సాగిన కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల్లో ఎంఐఎం.. మోడీ, అమిత్‌షాల‌కు షాకిచ్చింద‌నే చెప్పాలి. ఇది వార్త.

వాస్తవానికి అసద్ ను పెంచిపోషిస్తున్నది మోడీషాలే అని బయట టాక్. అసద్ ఎంత విస్తరిస్తే హిందు ఓటు బ్యాంక్ అంత పోలరైజ్ అవుతుంది అనేది మోడీ షాల ఆలోచన. దానికి తగ్గట్టే అసద్ పార్టీ విస్తరిస్తే.  

విష‌యంలోకి వెళ్తే.. గుజరాత్‌లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇటీవ‌ల ఎన్నికలు జ‌రిగాయి. వీటి ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వ‌చ్చాయి. ఆయా కార్పొరేష‌న్ల‌లో బీజేపీ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవలం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా విఫ‌ల‌మైంది. అతి తక్కువ స్థానాలు మాత్ర‌మే గెలుచుకుంది.

ఇక‌, ఈ గుజ‌రాత్ స్థానిక ఎన్నిక‌ల్లో అటు ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ సూరత్ మున్సిపాలిటీలో 27 స్థానాలను గెలుచుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం గుజ‌రాత్‌లో బోణీ కొట్ట‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవ‌ల కాలంలో ఉత్త‌రాది స‌హా దేశ వ్యాప్తంగా ఖాతాలు తెరుస్తున్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం గుజ‌రాత్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జాంనగర్ మున్సిపాలిటీల‌కు జ‌రిగిన‌ ఎన్నికల ఫలితాలు మంగ‌ళ‌వారం వెలువడ్డాయి.  మొత్తం 576 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 341 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 38 స్థానాలతోనే సరిపెట్టుకుంది.

అహ్మదాబాద్‌లో 125 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 101 స్థానాలు గెలుకుంది. కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక ఎంఐఎం 4 స్థానాలను గెలుచుకుంది. సూరత్, వోడదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జాంనగర్ మున్సిపాలిటీ ఫలితాల్లోనూ ఇదే ప‌రిస్థితి కనిపించింది.

ఇక సూరత్‌ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చింది. మొత్తంగా.. ఇటీవ‌ల బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం.. నాలుగు చోట్ల గెలిచి స‌త్తా చాట‌గా.. ఇప్పుడు ఏకంగా గుజ‌రాత్‌లో గెలిచి.. మోడీ కి షాక్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీనిని ఎంఐఎం వ‌ర్గాలు జోరుగా ఎంజాయ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.