జబర్దస్త్ మగ లేడీస్ ... ఒరిజినల్స్ ముఖాలు ఇవే!

తెలుగు నాట అత్యంత జనాదరణ కలిగిన షో జబర్దస్త్ అనడంలో మరో మాటే లేదు. దీనిని చాలామంది బూతు షో అంటారు గాని... పల్లెటూళ్లకు అవి దైనందిన డైలాగులు. పల్లెటూళ్లలో చాలా కామన్ గా బూతులు మాట్లాడతారు. వాటి వెనుక ఏ దురుద్దేశాలు ఉండవు. అందుకే ఈ షో గ్రామీణంలో బాగా ఆదరణ పొందింది. వాస్తవానికి ఇది ఒక  సాధారణ కామెడీ షో కావడం, హార్డ్ కోర్ డ్రామా షో కావడంతో తొలుత ఎవరూ అమ్మాయిలు ఇందులో నటించేవారు కాదు. దీంతో అందులో లేడీ గెటప్ లు కూడా మగ వాళ్లే వేసే వారు.

చమ్మక్ చంద్ర తొలుత చాలా పాత్రలు లేడీ గెటప్ లో నే  వేశారు. కానీ ఆ తర్వాత రూటు మార్చారు. అయితే, ఇందులో విశేషం ఏంటంటే... రానురాను... కొందరు ఆర్టిస్టులు లేడీ గెటప్ లు తప్ప మగ పాత్రల్లో కనిపించడమే మానేశారు. ఆ క్రమంలో కొత్తగా షో చూసేవాళ్లు వాళ్లు మగాళ్లు అంటే నమ్మని స్థితిలో ఉండేవి ఆ గెటప్ లు. అంతగా ఆ గెటప్స్ లో ఒదిగిపోయారు వాళ్లు. ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది అమ్మాయిల పాత్రల్లో సూపర్ గా సెట్టయిపోయారు.

తాజాగా సుమ ఈ లేడీ గెటప్స్ అందరితో క్యాష్ షో చేసింది.ఈ షోలో వాళ్ల లేడీ రూపాలు, వాళ్ల అసలు రూపాలు కూడా చూపించారు. అయితే, ఆ గెటప్ తో వారు పండించే కామెడీ మాత్రమే తెలిసిన మనకు ఈ షోలో వారి జీవితంలో ఎంత దు:ఖం ఉందో చెబుతుంటే చూసేవారికి కూడా కన్నీరు వచ్చే పరిస్థితి. వారు క్యాష్ షోలో చేసిన సందడి, వారి వాస్తవ జీవితంలో ఈ గెటప్స్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ వారం క్యాష్ ప్రోగ్రాంలో చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.