జగన్...ఢిల్లీకి రా! అమిత్ షా నుంచి పిలుపు

ముఖ్యమంత్రి జగన్... మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. తనది సొంత పార్టీ అయినా...  అదేంటో ఆయనకు ఎపుడూ ఢిల్లీ నుంచి పిలుపులు వస్తుంటాయి. విచిత్రం ఏంటంటే.... ఆయన ఢిల్లీకి వెళ్తే ఎపుడూ అమిత్ షానే కలుస్తుంటారు. పోనీ కలిశాక అయిన బయటకు వచ్చి ఏం మాట్లాడారో చెప్పరు. మాటిమాటికి హోంమంత్రిని కలవడం, ఇప్పటికే జగన్ మీద అనేక కేసులు ఉండటంతో ఏపీ ప్రజలు వారి చర్చల గురించి వారు వెల్లడించకపోయినా ఒక నిర్ణయానికి వచ్చేశారని... సోషల్ మీడియాలో చర్చలను బట్టి అర్థమవుతోంది.

ఇక ఆయన షెడ్యూల్ చూస్తే.... జగన్మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అపాయింట్‌మెంట్ ఖరారు చేసి ఢిల్లీకి పిలిచారట. ఇక వెళ్లక తప్పింది కూడా లేదు.  ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. డీజీపీ ఆలయాల దాడులపై బీజేపీ హస్తం ఉందదని చెప్పిన నాల్రోజులకే ఢిల్లీ నుంచి జగన్ కి పిలుపు రావడం గమనార్హం.

ఏపీలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా హిందు సంస్కృతిపై దాడి జరుగుతోంది. ఆలయాలపై దాడులు, ఆలయాల ఆస్తులు ధ్వంసం, దొంగతనం, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా నిందితులు ఎవరన్నది మిస్టరీగా ఉండటంతో హిందు ధర్మం ఆచరించేరవారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. ఏపీలో హిందు ధర్మంపై దాడి దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవడంతో జగన్ సర్కారు ఇరుకున పడింది. దాడులు జరగడం ఒక ఎత్తు, నిందితులను పట్టుకోకపోవడం అసలు ఆగ్రహానికి కారణం అవుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.