కువైట్ NRI తెలుగుదేశం రక్తదాన కార్యక్రమం విజయవంతం

NRI
ఈ రోజు 22/01/2021 శుక్రవారం యన్. ఆర్. ఐ తెలుగుదేశం కువైట్ మరియు యన్.టి.ఆర్. ట్రస్ట్ సౌజన్యంతో కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.విపరీతమైన చలిగాలులు వున్నప్పటికి కూడా,యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ కార్యకర్తలు,అభిమానులు ,సానుభూతి పరులు,తెలుగువారు తండోప తండలుగా కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కి తరిలి వచ్చారు.అందులో  చాలామంది  చలిగాలులకు  బ్లడ్ బ్యాంక్  బయట వుండలేక వారి వారి స్వస్థలాలకు ఇంటికి వెళ్ళి పోగా, మిగిలిన  224 మంది,ఆరోగ్య రీత్యా పరీక్షలు మరియు కోవిడ్19 నిబందనలకు అనుకూలంగా నడుచు కోవడంతో, సమయం లేకపోవడం తో  108 మంది మాత్రం రక్తదానం చేయడం జరిగినది.ఈ విషయంలో “డాక్టర్ అస్నా” గారికి ప్రత్యేక ధన్యవాదములు,అదేవిదంగా రక్తదాతలకు యన్.టి.ఆర్. ట్రస్ట్ వారు అబినంధన పత్రాలను అందచేయడంతో అబినంధన పత్రాలను తీసుకొన్న ప్రతి ఒక్క రక్తదాత అన్న 'నందమూరి తారకరముడి'ని తలుచుకొని ఉప్పొంగి పోయారు.ఈ కార్యక్రమమును తమ పత్రిక ద్వారా అందరికీ చేరవేసి,చేతన్య పరచిన 'నమస్తే ఆంధ్ర' యజమాన్యానికి  ప్రత్యేక దన్యవాదములు అని మరియు ఈ ప్రోగ్రాం విజయవంతం కావటానికి అన్నీ రకాల సూచనలు, సలహాలు, చేసి ముందుండి నడిపించిన 'బలరామ్ నాయుడు దరూరి'గారికి ప్రత్యేక దన్యవాదములు తెలియచేస్తున్నాము అని ఒక సంయుక్త ప్రకటనలో  అధ్యక్షులు 'వెంకట్ కోడూరి',  ప్రధాన కార్యదర్శి 'నాగేంద్రబాబు అక్కిలి' తెలియచేసారు.
అత్యవసర సమయంలో రక్తం అందించిన దాతలే వారి పాలిట దేవుళ్లుగా రోగి సహాయకులు భావిస్తారు.ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడిన వారవుతారని, రక్తం ఎక్కువగా అవసరం ఉండే తలసేమియా, క్యానర్స్ పేషెంట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాధారణంగా తలసేమియా పేషెంట్లకు నెలకు రెండు సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతులైన వారు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి పాలిట ప్రాణదాతలు కావాలని, రక్తసంబంధంతోనే బంధాలు ఏర్పడవు రక్తదానంతో కూడా ఏర్పడుతాయి అని  బలరామ్ నాయుడు పిలుపునిచ్చారు.
రక్తదానం వల్ల రక్తం తగ్గి రక్తహీనత వస్తుంది అనడం అవాస్తవం,రక్త దానానికి ముందు అన్ని పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతుల నుండి మాత్రమే తీసుకుంటారు.కనుక రక్తదానం తర్వాత ఎటువంటి రక్తహీనత ఏర్పడదు.ఒక యూనిట్‌ రక్తంలోని ఎర్ర రక్తకణాలు 3 రోజుల్లో, తెల్లకణాలు 3 వారాల్లో తిరిగి ఏర్పడతాయి అని జాయింట్ సెక్రెటరీ 'మోహన్ రాచూరి'తన ప్రసంగంలో తెలియచేసారు .
రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు అనడం వాస్తవం కాదు , రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు.అరగంట విశ్రాంతి తీసుకుని,ఒక రోజు ద్రవ పదార్ధాలు విరివిగా తీసుకుంటే ఎప్పటిలా ఆరోగ్యంగా ఇంకా ఉత్సాహంగా ఉంటారు అని మైనారిటీ విభాగం అధ్యక్షులు 'షేక్ రహమతుల్లా'వివరించారు.
కష్టమైన, శ్రమతో కూడిన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు అనడం సరికాదు,రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు అని తెలుగు యువత అధ్యక్షులు 'మల్లీ మరాతు' తన ప్రసంగంలో తెలియచేసారు .
రక్తదానం సమయంలో విపరీతమైన నొప్పి అనడం వాస్తవం కాదు, రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన బాధ ఉండదు అని బీసీ విభాగం అధ్యక్షులు 'రాము యాదవ్ 'అన్నారు.
ఈ రక్తదాన  కార్యక్రమము నకు వచ్చి, అక్కడ దాతలకు అనేక సహాయ సహకారాలు అందించిన నాయకులు, ఎనిగల బాలకృష్ణ గారు,సాయి సుబ్బారావు, శ్రీనివాస్ తలమంచి , B. P.నాయుడు, పార్థసారది, రమేశ్ కొల్లరపు , శంకరయ్య ఈరాతి, సత్య సాయి బాబా దౌర్ల శ్రీనివాస చౌదరి పిడికిటి,షేక్ యం డి. అర్షద్, భాస్కర్ నాయుడు మల్లరపు, ముస్తాక్ ఖాన్,కరీం టి, బాబా సాహెబ్, కదీర్ బాషా, బొమ్ము నరసింహులు (సింహా),గారికి ప్రధాన కార్యదర్శి 'నాగేంద్ర బాబు' దన్యవాదములు తెలియచేసారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.