నీ మరణం కూడా సంగీతమైంది బాలూ !
నేను ఫేస్ బుక్ వాడతానువ్వు ట్విట్టరు వాడతావు
ఆయన ఇన్ స్టా వాడుతున్నాడు
ఈమె చింగారి వాడుతోంది
అదుగో ఆయన యూట్యూబ్ లోనే ఉంటుంటాడు
...
కానీ నాకు నీకు ఆయనకు ఈమెకు అందరికీ ఈరోజు బాలు తప్ప ఎవరైనా కనిపిస్తున్నారా? బాలు తప్ప ఎవరైనా వినిపిస్తున్నారా. ఎందెందు వెతికినా అందందటున నీ పాటే
....
నీ మరణంలోను పాటతో శాంతిని పంచుతూ పోతున్నావు
.......
దేవుడు సర్వాంతర్యామి. అదృష్టవంతులకు కనిపిస్తాడు.
మన బాలు కూడా సర్వాంతర్యామి కాకపోయినా అందరికీ కనిపిస్తున్నాడు. అంతటా కనిపిస్తున్నాడు...
దీన్నే బ్రో ‘కీర్తి శేషం‘ అంటారు
అంటే ఆయన ఉండరు.... ఆయన పేరు మాత్రం మనకు వినిపిస్తూ ఉంటుంది. గొప్పగా... మహోన్నతంగా వినిపిస్తుంటుంది.బాలుది అదృష్టం... ఆయన పేరే కాదు, పాట కూడా వినిపిస్తుంటుందిఎవరి కీర్తిని అయినా మరిచిపోతామేమో గాని బాలు సేవా కీర్తిని మరిచిపోగలమా?మనం మరిచిపోయినా మన పక్కింటోడు మరిచిపోనివ్వడు. బాలు అజరామరంబాలు పాటు అజరామరంఆయన పాడిన భాషలన్నీ ఈ లోకంలో అంతమైనరోజున కనమరుగైన రోజును బాలు వినిపించకపోవచ్చు.అదీ జరగదుఇదీ జరగదుబాలు మీకోసం మేమేమీ చేయలేదు. కానీ మా కోసం నువ్వు మేం రుణం తీర్చుకోలేనంత చేశావునీ రుణం తీర్చుకోవడం మాకు సాధ్యం కాదు బాలూ... సాధ్యం కాదు, సారీ, వి ఆర్ వెరీ సారీ.