'తానా'లో నవ శకం-నిజమా? రంగుల కలా??

'తానా'లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.రోజు రోజుకీ మారుతున్న పరిణామాల మూలంగా ఇంకా ఇంకా ఎక్కువమంది చర్చల్లో పాల్గొంటూ సాధ్యా సాధ్యాల గురించి, మంచీ చెడుల గురించి,తమదైన భావాలు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఎట్లా ఉన్నప్పటికీ , సీనియర్ నాయకుడు 'శ్రీనివాస గోగినేని' పోటీలోకి రావటం తో పాటు, చాపకింద నీరులా మొదలైన అయన ఎన్నికల ప్రచారం క్రమంగా విస్తరిస్తూ ఉన్న పరిస్థితుల్లోనూ, 'నిరంజన్ శృంగవరపు' పోటీ విరమణకు ససేమిరా అంటున్నందువల్లనూ, 'నరేన్ కొడాలి' వర్గంనుంచి ఇద్దరు రామ్ రామ్ (మేము తిరిగి రాము,రాము)అన్నందువల్లనూ ,జరుగుతున్న అనేక ఇతర పరిణామాలతో  విషయం విష మించినట్లేనని అత్యధికమంది భావన. ఇది ఇలాగే కొనసాగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుండగా, చివరికి సంభవించే తుది ఫలితం 'తానా' సంస్థ భవిష్యత్తును ఎదో ఒక దిశలో కనీసం దశాబ్దం పాటు నిర్దేసిస్తుందని అనుకుంటున్నారు.
ఈ పరిణామాల మొదటి దెబ్బగా స్వయం ప్రకటిత అధిష్ఠానం దిమ్మెర పోయినట్లుగా చెప్పవచ్చు. ఒకవైపు బే ఏరియాలో ఒకరి ఫిరాయింపు, మరొక నాయకుడి ధిక్కరింపు ఒక ముఖ్య నాయకునికి బాధ కలిగిస్తుండగా, మరొక ముఖ్య నాయకుడున్నడిట్రాయిట్ ఏరియా నుంచి తమ అభీష్టానికి విరుద్ధంగా ఇద్దరు అత్యున్నతి పదవికే పోటీ పడటం చెప్పుకోలేని ఇబ్బంది పెడుతుండగా, ఇక మిగిలిన మూడవ నాయకుడు తమ కాపిటల్ డి.సి ఏరియా నుంచి నిలబెట్టుతున్నఅభ్యర్థికై వ్యక్తిగతంగానూ, ప్రత్యక్షంగానూ రంగం లోకి దిగవల్సి రావటం కారణంగా ముందునుంచి చెప్పుకుంటున్న'కింగ్ మేకర్స్' పవర్ ఇమేజి ప్రస్తుతానికి అంతం అయినట్లేనని చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి పరిస్థితుల్ని ఆధీనంలోకైనా తెచ్చుకోవాలి లేదా ధిక్కరించిన వారికి ఓటమితో గట్టి సమాధానమైనా ఇవ్వాల్సిన క్లిష్ట పరిస్థితి దాపురించింది. అందువలననే ఇప్పటికీ 'త్రిముఖ' పోటీ విరమణలకై రకరకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇక అధిష్టానాన్ని ధిక్కరించిన నాయకుడు ఏ దారిలో ఉన్నాడో, ఇంకా బహిరంగంగా చెప్పకపోవడం తోపాటు, 'శ్రీనివాస గోగినేని' పోటీ ప్రభావం తమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్నఅనుమానం మూలంగా 'నిరంజన్ శృంగవరపు' వర్గం ప్యానెల్ కుదింపు పై ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. అదే సమయంలో ఇద్దరు నాయకుల నష్టం మూలంగా 'నరేన్ కొడాలి' వర్గంపై పడిన వత్తిడి కారణంగా 'నిరంజన్ శృంగవరపు' వర్గం ప్రస్తుతానికి మానసిక ఆధిక్యత ఫీలవుతున్నారు. అదే కారణంతో ఇంకా ధీటైన అభ్యర్థులను పోటీలోకి తెచ్చి ఫిరాయించిన నాయకులకు ఛాలెంజ్ విసరాలని 'నరేన్ కొడాలి' వర్గం తమ ప్యానెల్ అభ్యర్థుల ఎంపిక పై కిందా మీదా పడుతోంది. అలాగే 'శ్రీనివాస గోగినేని' పోటీ తమకు లాభం కలిగించవచ్చని అనుకుంటూనే, ప్రస్తుతము ఉన్న అసాధారణ పరిస్థితుల్లో ఆయనకున్న గుర్తింపు మూలంగా క్రమ క్రమంగా తమను కూడా దాటి పోతాడేమోనని అనుమానపడ్తున్నారు. అలాగే 'శ్రీనివాస గోగినేని' కూడా చాల రాష్ట్రాల్లోని సభ్యులనించి క్రమంగా సమీకరించుకుంటున్న మద్దతు, ప్రత్యర్థి వర్గాలైన 'నిరంజన్ శృంగవరపు' మరియు 'నరేన్ కొడాలి' వర్గాలకు క్షేత్ర స్థాయిలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న గుంపుల బలాన్ని దాటగలదా అని బేరీజు వేస్తున్నట్లు సమాచారం. కానీ ప్రత్యర్థి వర్గాల నిట్టనిలువు చీలిక గెలుపు కోసం తనకు కావలసిన  టార్గెట్ సంఖ్యను సగానికి తగ్గించిన కారణంగాను, తనకు స్వచ్ఛందంగా గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నకారణంగా, సమాన స్థాయి పోటీదారునిగా మారి స్వంత ప్యానెల్ను అత్యంత రహస్యంగా ఏర్పాటుచేసుకొంటూ సాగిపోతున్నట్లు సమాచారం.
అలాగే ఈ ఎన్నికల ఫలితాల తదనంతర పరిస్థితుల్లో 'తానా' కార్యవర్గాల్లో సంభవించే పరిణామాల గురించి కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రజల సేవ, సంక్షేమం కోసం పాటుపడే 'తానా ఫౌండేషన్' గురించి క్రింది విషయాలు తెలుస్తున్నాయి.అనేకమంది పెద్దల నాయకత్వంలో సేవా విభాగంగా మొదలైన 'తానా ఫౌండేషన్' గత కొద్ది సంవత్సరాలుగా విజయవంతంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా 'దిలీప్ కూచిపూడి', 'జయ్ తాళ్లూరి' నాయకత్వంలో మొదలైన అనేక కొత్త కార్యక్రమాలు 'శ్రీనివాస గోగినేని' నాయకత్వంలో పతాక స్థాయికి చేరి 'మనఊరికోసం' నినాదంతో వివిధ రాష్ట్రాల్లో చేసిన '5కే రన్స్' మూలంగా మరింత ప్రాచుర్యం పొంది, 'నిరంజన్ శృంగవరపు' నాయకత్వంలో కూడా కొనసాగుతూ 'తానా' సంస్థకు ఇండియాలో కూడా ప్రత్యేక గుర్తింపును తెస్తోంది. అందువలననే 'తానా ఫౌండేషన్' తదుపరి నాయకత్వంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. రాజ్యసభలాగా ఫౌండేషన్ ట్రస్టీల్లో సగం మంది ప్రతి ఎలక్షన్లోనూ రిటైర్ అయి కొత్తవారి ఎన్నిక జరుగుతుంది. మొత్తం సభ్యులందరూ కలసి తరువాతి రెండు ఏళ్ళ టెర్మ్ కు నాయకత్వంను ఎన్నుకుంటారు.
భారీ విరాళాలతోపాటు, ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేస్తూ, క్లిష్టతరమైన కోశాధికారి పదవిని నిర్వహిస్తున్న 'శశికాంత్ వల్లేపల్లి' తదుపరి చైర్మన్ కావడానికి ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి.సేవ మరియు విరాళాలు రెండూ చేస్తుండటంతో పాటు 'నరేన్ కొడాలి'వర్గంతో సన్నిహితత్వం మిగతా వారికంటే ముందంజ లో ఉండటానికి ముఖ్యకారణం. ఆ స్థాయిలో కాకపోయినా, అవే కారణాలతో ప్రస్తుత కార్యదర్శి 'రవి మందలపు' కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. 'తానా' మాంత్రికుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నప్పటికీ 'మంత్రాలకు చింతకాయలు' రాలే టైము అయిపోయినట్లుగా అనుమానం పీడిస్తోంది. ఈ టర్మ్ సెక్రటరీ పదవి విషయంలో భంగపడిన గత కోశాధికారి 'రమాకాంత్ కోయ' కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. 'నిరంజన్ శృంగవరపు'ప్యానెల్ భారీ విజయం సాధిస్తే, తనకు అవకాశాలు ఉంటాయని ఆశపడ్తున్నట్లు చెప్పుకుంటున్నారు.అలాగే ఎన్నోఎళ్ల  కిందటే కార్యదర్శిగా పని చేసిన 'వెంకట రమణ యార్లగడ్డ' కూడా చైర్మన్ పదవిని కోరుకుంటున్నారు. కానీ 'తానా' లోని ప్రస్తుత రెండు వర్గాల మద్దతు పొందే అవకాశం ఇసుమంతైనా లేకపోవడం తన మైనస్ గా భావిస్తూ, వచ్చే టర్మ్ 'ప్రెసిడెంట్ ఎలెక్ట్' పోటీ పై దృష్ఠి పెట్టటం మంచిదని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఈ సందర్భంగా గత 'నమస్తే ఆంధ్ర' కధనంలో అందరికీ నచ్చిన మూడు టిట్ బిట్స్
'ఇంత సందట్లోనూ గమ్ముగా ఉన్నఅట్లాంటా వాసులు, గేమ్ క్లోజర్స్ వాళ్లేనని కొందరి  భావన'
'సముద్రంకంటే లోతైన 'లావు బ్రదర్స్ 'అంతరంగం, మాంత్రికుడికే అర్ధం కాని వైనం'
'అట్లాంటా తమదేనని అందరి ఆశా, అయినా పీడిస్తున్న అనుమానం భూతం'
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.