తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి 'శశాంక్ యార్లగడ్డ' పోటీ

NRI
అమెరికాలో తెలుగువాళ్లంతా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ('తానా') ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి 'తానా' ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కొత్త, పాతల కలయికతో పలువురు అభ్యర్థులు 'తానా' ఎన్నికల బరిలో నిలుచుంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
ఫిబ్రవరి 25న నామినేషన్ల తుదిజాబితా విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్ల ఉప సంహరణపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల పదవీకాలం (2021-2023) గల స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ పదవికి 'శశాంక్ యార్లగడ్డ' పోటీ చేస్తున్నారు. తనను గెలిపించాలని, 'తానా' అభివృద్ధికి పాటుబడతానని శశాంక్ అంటున్నారు. 'తానా' పెద్దలు, నాయకుల అంకిత భావం చూసి తాను స్ఫూర్తి పొంది 'తానా' ఎన్నికల బరిలో దిగానని, భారత్, అమెరికాలో వారు నిర్వహించే పలు సేవా కార్యక్రమాలు, సమాజ సేవ, సాంస్కృతిక కార్యకలాపాలు చూసి తాను కూడా వారి అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానని శశాంక్ చెప్పారు.
ఇల్లినాయిస్ లోని ఓ నీల్ మిడిల్ స్కూల్ లో, మిస్సిసిపీలోని జాక్సన్ స్టేట్ యూనివర్సిటీలో శశాంక్ విద్యనభ్యసించారు. ఇల్లినాయుస్  హైస్కూల్ లో అమెరికన్ ఫుట్ బాల్ టీం ఆటగాడిగా కాలేజ ీరోజుల్లో శశంక్ కు మంచి ఆటగాడిగా పేరుంది. హైస్కూల్ స్టేజిలో అమెరికన్ ఫుట్ బాల్ టీంలో ఆడారు. హైస్కూల్ డీ-ఐ లెవల్ల ో క్రికెట్ ఆడిన శశాంక్...రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటులు నిర్వహించి సత్తా చాటారు.
'తానా' యూత్ లీడర్ షిప్ అండ్ ప్రొటెక్షన్ కు కోచైర్మన్ గా పనిచేసిన అనుభవం శశాంక్ కు ఉంది. అనేకసార్లు 'తానా' కార్యక్రమాలకు ఆర్థికంగాను శశాంక్ సాయమందించారు. లాక్ డౌన్ సమయంలో 'తానా' ఫ్రంట్ లైన్ వర్కర్లను శశాంక్ సన్మానించారు. లాక్ డౌన్ సమయంలో మాస్క్లు పంపిణీ చేసి మానవత్వాన్నిచాటుకున్నారు. జాక్సన్ స్టేట్ యూనివర్సిటీ ఇండియన్ అసోసియేషన్, మిస్సిసిపి తెలుగు అసోసియేషన్ లలో చురుగ్గా పాల్గొన్నారు.
'తానా'లో తర్వాతి తరం నాయకుల్లో మొదటివాడిగా నిలవడమే తన లక్ష్యమని శశాంక్ అంటున్నారు. 'తానా' అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలందిస్తానని చెబుతున్నారు. పెద్దా, చిన్నా అందరినీ కలుపుకుపోయి...అమెరికాతోపాటు భారత్ లోనూ తెలుగువారి అభివృద్ధికి పాటుబడతానని చెబుతున్నారు. తనను గెలిపించాల్సిందిగా శశాంక్ అభ్యర్థిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.