ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) 2021 నూతన కార్యవర్గం

NRI

జనవరి 3, 2021, డాలస్/ఫోర్ట్ వర్త్

శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి  నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం  (టాoటెక్స్) 2021 నూతన కార్యవర్గం

తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టంకట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాoటెక్స్) వారు 2021 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 3 వ తేదీన  డాలస్ లో  జరిగిన గవర్నింగ్  బోర్డు సమావేశంలో ప్రకటించారు.
ఈ  సందర్బంగాలక్ష్మి  అన్నపూర్ణ  పాలేటి సంస్థ నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలుస్వీకరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) లాంటి గొప్ప సంస్థకి అధ్యక్ష పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికాలోనేప్రతిష్టాత్మక సంస్థ అయిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంను  (టాoటెక్స్) ముందుండినడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్)  సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతనకార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు క్రొత్తగాఎన్నికైన కార్యనిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నాననితెలియజేసారు.
అంతేకాకుండా 2020 సంవత్సరానికి టాంటెక్స్  సంస్థ ఎన్నికల అధికారి శ్రీ జొన్నల  గడ్డ సుబ్రహ్మణ్యం గారు మరియు వారి బృందం కలిసి  టాంటెక్స్ అధికారిక కార్యవర్గము మరియు  పాలక మండలి  ఎన్నికలను  డిసెంబర్ మాసములో ఎంతో నేర్పుతో దిగ్విజయంగా పూర్తి చేశారనితెలిపారు. అంతే  కాకుండా క్రొత్తగా ఎన్నికయిన అధికారిక కార్యవర్గము మరియు పాలకమండలిసభ్యులతో ఈరోజు  ప్రమాణస్వీకారం చేయించారని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించినఎన్నికల అధికారి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారికి వారి బృందానికి మన టాంటెక్స్ సభ్యులందరి తరపున  సవినయముగా  కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని సంస్థ నూతన అధ్యక్షులు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి తెలియజేశారు.
2021 అధికారిక కార్యనిర్వాహక బృందం :
అధ్యక్షులు :  లక్ష్మి అన్నపూర్ణ పాలేటి
ఉత్తరాధ్యక్షుడు :  ఉమా మహేష్ పార్నపల్లి
ఉపాధ్యక్షుడు : శరత్ రెడ్డి ఎర్రం
కార్యదర్శి :  కల్యాణి తాడిమేటి
సంయుక్త కార్యదర్శి : శ్రీ కాంత్ రెడ్డి జొన్నల
కోశాధికారి:  చంద్ర శేకర్ రెడ్డి పొట్టిపాటి
సంయుక్త కోశాధికారి:  స్రవంతి ఎర్రమనేని
తక్షణ పూర్వాధ్యక్షులు: కృష్ణా రెడ్డి కోడూరు
కార్యవర్గ బృందం:
లోకేష నాయుడు కొణిదల, మల్లిక్ రెడ్డి కొండా, వెంకటేష్ బొమ్మ, చంద్రా రెడ్డి పోలీస్, ప్రభాకర్ రెడ్డి మెట్టా, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, సరిత రెడ్డి ఈదర, నీరజ కుప్పాచి, ఉదయ్ కిరణ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగళ్ళ,  నాగరాజ్ చల్లా, సురేష్ పాతినేని, సుబ్బా రెడ్డి కొండు
పాలక మండలి బృందం:
అధిపతి : డా. పవన్ పామదుర్తి,
ఉపాధిపతి: వెంకట్ ములుకుట్ల
శ్రీ కాంత్ పోలవరపు, శ్రీలక్ష్మి మండిగ,  గీతా దమ్మన్న,  అనంత మల్లవరపు, డా. భాస్కర రెడ్డి  శనికొమ్ము
కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2021లో అడుగుపెట్టి అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ నూతనఅధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి తెలిపారు. మరిన్ని వివరాలకు www.tantex.org ని సందర్శించండి.
2020 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షులుగా పనిచేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణపూర్వాధ్యక్షులు శ్రీకృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటిగారి నేతృత్వంలో ఏర్పడిన 2021 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.