సొట్టబుగ్గల వయ్యారి కల నిజం కానుంది

కొత్త ఏడాది మొద‌లైన‌ప్ప‌టి నుంచి కొత్త సినిమాల రిలీజ్ డేట్ క‌బుర్లు వింటూనే ఉన్నాం. ఒక్కో వారంలో నాలుగైదు సినిమాల రిలీజ్ డేట్లు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. ఈ మ‌ధ్య అయితే రోజూ కొత్త సినిమాల విడుద‌ల తేదీల‌పై ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌రో రెండు ఆస‌క్తిక‌ర కొత్త చిత్రాల విడుద‌ల తేదీలు ఖ‌రార‌య్యాయి. ఆ సినిమాలే.. ఉప్పెన‌, ఎ1 ఎక్స్‌ప్రెస్.

గ‌త ఏడాది ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన సినిమా ఉప్పెన‌.ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్‌కు రెడీ అయింది. ఈ పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ‌.. ప్రేమికుల దినోత్స‌వ వారాంతంలో రావ‌డం క‌లిసొచ్చే విష‌య‌మే.  మెగాస్టార్ చిరంజీవి చిన్న మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌ను హీరోగా, కృతిశెట్టిన హీరోయిన్‌గా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌నాను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన చిత్ర‌మిది.

పాట‌లు, టీజ‌ర్, ఇత‌ర ప్రోమోల‌న్నీ కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉండి ఈ సినిమాపై అంచ‌నాలు పెంచాయి. థియేటర్ల‌లోనే, మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాల‌ని భావించి ఆపిన ఈ చిత్రాన్ని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు.

ఇక సందీప్ కిష‌న్ త‌న అవ‌తారాన్ని ఎంత‌గానో మార్చుకుని హాకీ క్రీడ‌లో శిక్ష‌ణ పొంది మ‌రీ చేసిన సినిమా ఎ1 ఎక్స్‌ప్రెస్. ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 26న విడుద‌ల చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఎ1 ఎక్స్‌ప్రెస్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునే అన్ని అంశాల ఈ సినిమాలో ఉన్న‌ట్లే అనిపించింది ట్రైల‌ర్ చూస్తే.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన న‌ట్పె తునై సినిమాకు ఇది రీమేక్‌. అందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్  హిప్ హాప్ ఆది క‌థానాయ‌కుడిగా న‌టించాడు. అత‌నే సంగీతం స‌మ‌కూర్చాడు. తెలుగు వెర్ష‌న్‌కు అత‌నే సంగీత ద‌ర్శ‌కుడు.పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ దర్శ‌క‌త్వం వ‌హించాడు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టించింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.