అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-'తానా' బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం

అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.ఎన్నికలు జరిగిన విధానం మెచ్చదగిన విధము గాను,నమ్మదగిన విధము గాను లేదని అనేకమంది భావించడమే దీనంతటికీ కారణం.అయితే అమెరికాలో నివసించే తెలుగు ప్రజలకు ముఖ్యంగా 'తానా' ఎన్నికల గురించి అవగాహన ఉన్నవారికి ,ఇది ఏ మాత్రం ఆశ్చర్యంకలిగించలేదు సరికదా, 'తానా'లో జరిగేదానితో  పోలిస్తే ఇది ఏపాటి అని తేలిగ్గా తీసి పారేస్తున్నారు. 'తానా' ను నియంత్రించాలనుకునే నాయకుల ముఠా చేసే పనులు ఎంతోమందికి  తెలిసిన విషయమే.
రాష్ట్రాలవారీగా కోటాలు ఇచ్చి, పోటీలు పెట్టి ఎవరికివారు స్వంత డబ్బుతో సంస్థపై ఏ ఇంట్రస్టు లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించేలా చేయడం, ఆ సంఖ్యలనుబట్టి, వారికి రేటింగులు ఇచ్చి,దానిప్రకారం పదవులు పంచడం ద్వారా దేశవ్యాప్తంగా సంస్థను గుప్పిట్లో పెట్టుకోవడం తెలిసిందే. ఎవరైనా తమ సేవలను,నిబద్ధతను నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలని చూస్తే,వారిని ఏకాకులని చేసి, మిగతావారందిరినీ వారిపై ఉసికొలిపి,చేర్పించిన ఓటర్ల ఇళ్లకువెళ్లి ,సీల్డ్ బాలట్ కవర్లను ఒకేచోటుకు తెచ్చి, గంపగుత్తగా ముద్దర్లు గుద్ది, ఫలితాలను తారుమారు చేయటం వెన్నతో పెట్టిన విద్య.ఇక ఈ విధంగా గెలిచే వారికి ప్రజా సేవలపై కాక ,ముఠా సేవలే పరమార్ధం కాక పోదు లేదా ఇంకా పై పదవుల ఆశ హుళక్కే.అలాగే కొత్తగా సంస్థలోకి  రావాలనుకునే వారు ముందుగా తమ స్వంత రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఓట్లు చేర్పించి,అప్లికేషన్ పెట్టుకోవలసిందే. దీనికి పరాకాష్టగా సరిగ్గా ఎన్నికల ముందు 2016 ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రెట్టింపైన 'తానా' సభ్యత్వాలు బహిరంగ సత్యంగా చెప్పుకోవచ్చు.
'నమస్తే ఆంధ్ర' నవంబర్ లోనే ఊహించిన విధంగా సీనియర్ నాయకుడు 'శ్రీనివాస గోగినేని' ప్రెసిడింట్ ఎలెక్ట్ పదవికి పోటీలో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అలాగే 'నిరంజన్ శృంగవరపు 'నమస్తే ఆంధ్ర' తో  మాట్లాడుతూ తాను కూడ అతి త్వరలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తానని చెప్పారు.అలాగే  'నరేన్ కొడాలి' వర్గం కూడా ప్రకటన తేదీ గూర్చి తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.ఈ సారి పోటీ తమ గుత్తాధిపత్యానికి ప్రమాదకరంగా మారుతున్న విషయం గమనించిన కొందరు పెద్దలు బే ఏరియా కు చెందిన మాజీ బోర్డు అధ్యక్షుని ద్వారా రాజీ ప్రయత్నాలు సాగించినట్లు,అవి విఫలంకాగా,ఎన్నికలే సరైన మార్గమని అయన చెపుతున్నట్లు తెలిసింది.కానీ ఎలెక్షన్లు జరిగితే 'తానా'లో ఇప్పటివరకు జరిగిన అనేక విషయాలు మళ్ళీ బహిర్గతమై, అంతర్జాతీయ రచ్చ జరుగుతుందేమోనని చాలామంది భయపడుతున్నారు.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.