చంద్రబాబుపై వైసీపీ తాజా అస్త్రం అజయ్ కిషోర్.. ఎవరీయన

టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుపై వాగ్బాణాలు సంధిస్తూ.. ఇష్టానుసారం విమర్శ‌లు గుప్పి స్తున్న పాస్ట‌ర్‌.. అజయ్ కిషోర్‌.. వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేవా ల‌యాల‌పై రాష్ట్రంలో వ‌రుస‌గా జ‌రుగుతున్న దాడుల‌ను ప్ర‌శ్నించిన చంద్ర‌బాబుకు.. దీటైన స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం.. వైసీపీ పెద్ద‌లు, నాయ‌కులు చేయ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా చంద్ర బాబును క్రిస్టియ‌న్ సామాజిక వ‌ర్గానికి విల‌న్‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశా రు. అయితే.. ఈ విష‌యంలో తామే రంగంలోకి దిగితే బాగోద‌నుకున్నారో.. ఏమో.. అజ‌య్ కిషోర్ అనే పాస్ట ‌ర్‌ను రంగంలోకి దింపారు. మరి ఎవరీయన... ఈయన బాగోతం ఏంటి?
ఈ పోస్ట్ కు అజయ్ కిషోర్ పెట్టిన క్యాప్షన్ చదవండి

అనిల్ మ‌నిషే

పైకి అజ‌య్ కిషోర్‌.. కేవ‌లం తానొక పాస్ట‌ర్ మాదిరిగా క‌నిపించినా.. కొంచెం తెర‌దీసి చూస్తే.. మాత్రం అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడుతున్న అజ‌య్ కిషోర్... ఏకం గా వైసీపీ అధినేత జ‌గ‌న్ బావ‌మ‌రిది, బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్ సంస్థ‌తో క‌లిసి వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న వాడే కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి పాస్ట‌ర్ అంటే.. దైవానికి అంకిత‌మై.. దైవ బోధ‌న‌లకు మాత్ర‌మే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి నుంచి రాజ‌కీయాలకు , రాజ‌కీయ నేత‌ల‌కు అనుంగులుగా వ్య‌వ‌హ ‌రిస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైఎస్ కుటుంబంతో అజ‌య్ క‌షోర్‌.. `బంధం` ఈ నాటిది కాదంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు.

ఈ బంధం .. ఏ నాటిదో!

గ‌డిచిన ప‌ది ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా అజ‌య్ కిషోర్‌కు-వైఎస్ కుటుంబానికి మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల వంటి సంబంధం ఉందంటే విస్మ‌యం క‌లుగుతుంది. జ‌గ‌న్ బావ‌.. బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌తో క‌లిసి.. అనేక ప్రార్థ‌నా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అజ‌య్ కిషోర్‌.. ఏ సంద‌ర్భం వ‌చ్చినా..వైఎస్ కుటుంబంతో త‌న‌కున్న బంధాన్ని సంబంధాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ఇక‌, వైఎస్‌కు స‌మీప‌బంధువు, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డితోనూ అజ‌య్ కిషోర్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప‌లో ప్రార్థ‌నా కూడిక‌లు నిర్వ‌హించి.. అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇలా.. వైఎస్ కుటుంబంతో అనేక రూపాల్లో అజ‌య్ కిషోర్ బంధం పెన‌వేసుకుపోయింది.

బంధాన్ని బ‌ల‌ప‌రిచే ఉదాహ‌ర‌ణ‌లు..

+ వైఎస్ జ‌గ‌న్ తోను, వైఎస్ కుటుంబంతోనూ అజ‌య్ కిషోర్‌కు ఫెవికాల్ బంధం ఉంద‌నే చెప్పాలి. జ‌గ‌న్ కు సంబంధించిన అప్‌డేట్ అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫేస్‌బుక్ స‌హా వాట్సాప్‌, ట్విట్ట‌ర్ ఖాతాల‌లో షేర్ చేయ‌డంతోపాటు.. ప్ర‌భువు ప‌క్షాన ప్రార్థ‌న‌లు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం.
+ 2015లో వైసీపీ అధినేత‌గా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. జ‌గ‌న్, అప్ప‌టి ఎంపీ అవినాష్ రెడ్డిలు.. బ్ర‌ద‌ర్ ఎన్వీ కిశోర్‌ను క‌లిసిన విష‌యాన్ని అజ‌య్ త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి.. జ‌గ‌న్ కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చాడు.
+ 2019, జూలై ఎనిమిదిన వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను ఓ ఫాద‌ర్ ఆశీర్వ‌దిస్తున్న ఫొటోను షేర్ చేసి.. `ఉయ్ మిస్ యూ`` అని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.
+ 2019, మార్చి 23న ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌డ‌ప ప్ర‌స్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషా.. బ్ర‌ద‌ర్ అజ‌య్ కిషోర్‌, బ్ర‌ద‌ర్  విజ‌య్ కిషోర్ ల ఇంటికి వెళ్లిన‌ప్పుడు.. ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం కోరుతూ.. ప్రార్థ‌న‌లు చేశారు. ఈ విష‌యాన్ని ఫొటోల‌తోపాటు.. అజ‌య్ కిషోర్ షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం.
+ 2016, మార్చిలో.. వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు.. విజ‌య‌మ్మ‌ను కొనియాడుతూ.. సోష‌ల్ మీడియాలో అజ‌య్ పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డికి వెళ్లినా.. విజ‌య‌మ్మ‌.. బైబిల్ ప‌ట్టుకుని ఉంటున్నారు.. ఇదిశుభ‌ప‌రిణామం అని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.
+ 2019, మే 30.. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో బైబిల్‌ను చెంత‌నే ఉంచుకోవ‌డాన్ని కొనియాడుతూ.. అజ‌య్ కిషోర్ ట్వీట్.
+ 2020, మే 27.. పాస్ట‌ర్ల‌కు నెల‌నెల రూ.5000 పింఛ‌న్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అజ‌య్ కిషోర్‌.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఘ‌నంగా సత్క‌రించి... సీఎంకు, ప్ర‌భుత్వానికి మంచి జ‌ర‌గాల‌ని ప్రార్థంచారు.
+ 2018, ఫిబ్ర‌వ‌రి 10.. జ‌గ‌న్ బావ‌.. బ్ర‌ద‌ర్ అనిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అజ‌య్ కిషోర్‌.. శుభాకాంక్ష‌లు తెలప‌డం విశేషం. దీనికి సంబంధించి అనేక ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.
+ వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు చేసిన ఫొటోలు, వీడియోలు అనేకం ఉన్నాయి.
+ 2019, మే 24.. ఏపీలో జ‌గ‌న్ పార్టీ విజ‌యం సాధించ‌డంతో అజ‌య్ కిషోర్ పెద్ద పండ‌గే చేసుకున్నాడు.. వెంట‌నే ఇడుపుల పాయ‌లో వైఎస్ స‌మాధిని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు.
+ ఇక‌, అజ‌య్ కిషోర్‌-వైఎస్ కుటుంబానికి మ‌ధ్య ఉన్న బంధంలో ప‌రాకాష్ట ఏంటంటే.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్ర‌తినిధి ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ``నేను నా దేవుడైన ఏసుక్రీస్తును న‌మ్ముచున్నాను. ప్ర‌తి రోజూ బైబిల్‌ను చ‌దువుతాను. ప్రార్థన చేసుకుంటాను. నా దేవుని యందు భ‌య‌భ‌క్తులు క‌లిగి ఉన్నాను. నా ప్ర‌తిప‌నిలో నాకు ఆయ‌న తోడై ఉన్నాడు. నేను క్షమిస్తేనే.. ఆదేవుని చేత క్ష‌మించ‌బ‌డ‌తాను`` అని జ‌గ‌న్ పేర్కొన్న విష‌యాన్ని అజ‌య్ కిషోర్ పేర్కొంటూ... ``మ‌నంద‌రం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డేలా ప్రార్థ‌న‌లు చేయాలి``అని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

చివ‌రాఖ‌రుకు..

సో..పై సంగ‌తులు గ‌మ‌నిస్తే.. అజ‌య్ కిషోర్ ఎవ‌రో.. ఎవ‌రితో ఎలాంటి స‌యామీ బంధం ఉందో.. ఇట్టే అర్ధ మ‌వుతుంది. వైఎస్ కుటుంబంతో ఫెవికాల్ బంధంతోపాటు, అనిల్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న అజ య్ కిషోర్‌.. ప్ర‌భు భ‌క్తుడి వేషంలో చంద్ర‌బాబుపై చేస్తున్న విమ‌ర్శ‌లు ఫ‌క్తు.. ప్ర‌భుత్వంపై భ‌క్తినే చాటు తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.