నాంపల్లి కోర్టులో షర్మిల

ఎపి సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ, సోదరి వైయస్ షర్మిల హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. 2012 లో జరిగిన పరకాల ఉప ఎన్నికల సందర్భంగా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రోడ్‌షో నిర్వహించారు.  ఈ కేసులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
కొండా సురేఖా దంపతులు కూడా ఇదే కేసులో నిందితులు. కానీ వారిద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. కొండా సురేఖ దంపతులు కొంత సమయం ఇవ్వాలని కోర్టుకు అప్పీల్ చేశారు. దీంతో ఈ నెల 27 న కోర్టుకు హాజరుకావాలని కోర్టు వారిని ఆదేశించింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరకాల పోలీసులు కోర్టులో ఉంచారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.