బాబూ.. మీ దూర‌దృష్టి భేష్‌: మోడీ లేఖ‌

admin
Published by Admin — October 12, 2026 in Politics
News Image

ఏపీ సీఎం చంద్ర‌బాబును అభినందిస్తూ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా లేఖ రాశారు. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రా త్రుల సంద‌ర్భంగా ఆదివారం నుంచి `విజయవాడ ఉత్సవ్ 2.0` పేరుతో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నా రు. విజ‌య‌వాడ స‌హా ప‌లు ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాల‌పై మీడియాలో విస్తృత క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా వీటిపై స్పందించిన ప్ర‌ధాని మోడీ.. చంద్ర‌బాబు దూర‌దృష్టి భేష్ అంటూ ప్ర‌శంస‌లు గుప్పించా రు. విజ‌య‌వాడ స‌హా.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల బ్రాండ్ వాల్యూ పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

``ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఉత్సవపు రెండవ ఎడిషన్ జరుగుతోందని తెలుసుకోవడం సంతోషకరమైన విష యం. ఈ చొరవకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర‌ ప్రభుత్వానికి, విజయవాడ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన కృష్ణా నది, పూజ్యమైన కనక దుర్గ ఆలయం ఉన్న ఈ నగరానికి గొప్ప వారసత్వం ఉంది. ఒక నగర ప్రజలు తమ సంప్రదాయాలతో మమేకమై, వాటిని తర్వాతి తరానికి అందించినప్పుడే ఆ నగర సంస్కృతి నిలిచి ఉంటుంది.`` అని మోడీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

విజయవాడ ఉత్సవం ఈ వారసత్వాన్ని దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలోని కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలను సుగ‌మం చేస్తుంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. ఇది పర్యాటక రంగానికి కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు. ఈ ఉత్సవం నైపుణ్యాభి వృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నందుకు త‌న‌కు సంతోషంగా ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతతో ముందుకు సాగుతున్న కొద్దీ, మన నగరాలు తమ విశిష్ట సాంస్కృతిక గుర్తింపును సజీవంగా ఉంచుకునే రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

ఈ విషయంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని ప్ర‌ధాని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాన‌ని లేఖ‌లో తెలిపారు. ఈ పండుగ విజయవాడ ప్రజలకు, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. గ‌త ఏడాది నుంచి విజ‌యవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో ద‌స‌రా స‌మ‌యంలో ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Tags
Pm modi cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News