వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్

News Image

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తున్నారు. శుక్ర‌వారం.. గాలివీడు మండ‌లం ఎంపీడీవో, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌వ‌హ‌ర్ బాబుపై వైసీపీ నాయ‌కులు దాడి చేసిన ఘ‌ట‌న తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌వ‌హ‌ర్‌బాబు ను డిప్యూటీ సీఎం ప‌రామ‌ర్శించారు. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో క‌డ‌ప‌కు చేరుకున్న ప‌వ‌న్‌.. అక్క డ నుంచి రోడ్డు మార్గంలో ఆసుప‌త్రికి వెళ్లి జ‌వ‌హ‌ర్‌బాబును ప‌రామ‌ర్శించారు. ఆయ‌న‌కు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌వ‌హ‌ర్‌బాబు కుటుంబ స‌భ్యుల‌తోనూ భేటీ అయ్యారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందంటూ.. వారికి భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారు ఎవ‌రైనా కూడా.. వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు. కఠిన చర్యలు తీసుకొంటామని పవన్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఉంద‌ని.. వైసీపీ కాద‌ని.. దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వం లో తావు లేదని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స్పష్టం చేశారు. అనంత‌రం.. పోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న చర్చిం చారు. బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల‌కు సూచించారు. దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని విమ‌ర్శించారు. ఏం జ‌రిగింది? గాలి వీడు మండ‌లం ఎంపీపీ వైసీపీ పార్టీకి చెందిన నాయ‌కుడు. అయితే.. ఆయ‌న కాకుండా.. ఆయ‌న అన్న కుమారుడు ఒక‌రు శుక్ర‌వారం ఎంపీడీవో కార్యాల‌యానికి వ‌చ్చి.. ఎంపీపీ కార్యాల‌యం తాళాలు ఇవ్వాల‌ని హుకుం జారీ చేశాడు. అయితే..ఎంపీపీ వ‌స్తే త‌ప్ప తాళాలు ఇవ్వ‌న‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో నేరుగా ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబు చాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించి.. పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Previous News Next News

Related News