జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

admin
Published by Admin — June 17, 2025 in Politics, Andhra
News Image

జగన్ విషయంలో `ఈ పంతం సరికాదు` అనే మాట సొంత పార్టీలోనే వినిపిస్తోంది. గతంలో ఆయన మహిళా పక్షపాతిగా ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన వైసీపీ పాలనలో జగన్ మహిళలు పేరుతోనే ఇల్లు ఇచ్చారు. మహిళల పేరుతోనే అమ్మవ‌డి, చేయూత వంటి కీలకమై పథకాలను కూడా అమలు చేశారు. మెజారిటీగా మహిళల పక్షానికి ఆయన తాను అండగా ఉన్నానని సంకేతాలు కూడా ఇచ్చారు.

మంత్రివర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ల వరకు కూడా మహిళలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చాలా అండగా ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు వినిపించటం లేదు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలకు తను అండగా ఉన్నానని చెప్పుకునే జగన్ ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వివాదం రావడం అది కూడా తన సొంత ఛానల్ లో వివాదాస్పద వ్యాఖ్యలు తెరమీదకి రావడంతో మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది రాజధానికి సంబంధించిన విషయం కాదు మహిళల ఆత్మగౌరానికి సంబంధించిన విషయమ‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించినటువంటి అంశమని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ విషయంలో జగన్ పంతానికి పోయి కనీసం సారీ కూడా చెప్పకుండా ఇంకా సమర్థింపు ధోరణితోనే వ్యవహరించడం సరికాదు అనేటటువంటి వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీలు కూడా జగన్ వెంటే ఉన్నారని చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా ఎంత కూటమి ప్రభావం కనిపించినా ఎస్టీ నియోజకవర్గాలు అలాగే ఎస్సీ నియోజకవర్గంలో కూడా వైసిపి నాయకులు మెజారిటీ ఓట్లు తెచ్చుకోగలిగారంటే ఎస్సీ ఎస్టీలు అండగా ఉండబట్టే.

కానీ, ఇప్పుడు జగన్ వ్యవహరిస్తున్న తీరు, ఆయన చూపిస్తున్న పంతం వంటివి మొత్తానికే ఎసరు పెట్టేలాగా కనిపిస్తున్నాయి. రాజధాని విషయం కాదు ఇది మహిళల ఆత్మగౌరానికి సంబంధించిన విషయమని పదేపదే అధికార పార్టీ సహా మేధావులు కూడా చెబుతున్నప్పటికీ జగన్ దిగిరాకపోవడం కనీసం తన పక్షాన “ఇది జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది“ అనే పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించ కపోవడం ఆ పార్టీకి ఆయనకు కూడా ఇబ్బందికర పరిణామంగానే మారింది. దీనిపై ఇప్పటికైనా స్పందించి ఒక నిర్ణయం ప్రకటించి ఎస్సీ ఎస్టీల ఆగ్రహానికి పుల్ స్టాప్ పెడితే తప్ప జగన్ను విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదన్నది వాస్తవం.

Tags
ex cm jagan losing trust sc and st voters
Recent Comments
Leave a Comment

Related News

Latest News