‘రాజేష్ కిలారు’…టీడీపీ నేతలకు ఈ పేరు సుపరిచితమే. అలా అని ఆయన టీడీపీకి సంబంధించి ఏ రకమైన హోదాలో లేరు. టీడీపీ అధికార ప్రతినిధి కూడా కాదు.. ‘రాజేష్ కిలారు’ కు ప్రభుత్వ పరంగా ఎటువంటి పదవీ లేదు…ఏదో ఒక కార్పొరేషన్ కు ఛైర్మన్ కూడా కాదు.. అయినా సరే టీడీపీలో కీలక వ్యక్తిగా….ఇంకా చెప్పాలంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల తర్వాత మూడో కీలక వ్యక్తిగా గా ‘రాజేష్ కిలారు’ ఎదిగారని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అసలు ఎవరు ఈ ‘రాజేష్ కిలారు’ అన్న చర్చ మొదలైంది.
హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో నారా లోకేష్ తో పాటు కలిసి ‘రాజేష్ కిలారు’ చదువుకున్నారు. 35 ఏళ్లుగా లోకేష్ తో స్నేహాన్ని ‘రాజేష్ కిలారు’ కొనసాగిస్తున్నారు. అమెరికాలో మాస్టర్స్ చేసిన ‘రాజేష్ కిలారు’…ఆ తర్వాత ఇండియాకు వచ్చేశారు. 2012 నుంచి నారా లోకేష్ తో కలిసి ‘రాజేష్ కిలారు’ రాజకీయ ప్రయాణం మొదలుబెట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో…2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టడంలోనూ ‘రాజేష్ కిలారు’ కీలక పాత్ర పోషించారని టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అంతేకాదు, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావడం వెనుక ‘రాజేష్ కిలారు’ఉన్నారు. టీడీపీ గెలుపులో యువగళం కీలకపాత్ర పోషిస్తే యువగళం విజయవంతం కావడంలో ‘రాజేష్ కిలారు’ కీలక పాత్ర పోషించారు. ఆ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ జననేతగా ఎదగడం వెనుక ‘రాజేష్ కిలారు’ పాత్ర ఉందని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ‘రాజేష్ కిలారు’ ను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేయాలని చూసింది. ‘రాజేష్ కిలారు’పై కూడా కేసులు పెట్టగా…న్యాయ పోరాటం ద్వారా ఆయన ఎదుర్కొన్నారు. 2023లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ‘రాజేష్ కిలారు’ పై కూడా సిఐడి విచారణ జరిగింది. విచారణకు హాజరైన ‘రాజేష్ కిలారు’ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు.
తన మిత్రుడు నారా లోకేష్ కు మాత్రమే కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ‘రాజేష్ కిలారు’ సన్నిహితుడిగా మారారని భోగట్టా. తన సామర్థ్యం, పనితీరుతో చంద్రబాబును ‘రాజేష్ కిలారు’ ఆకట్టుకున్నారట. చంద్రబాబు, లోకేష్ తమ తమ పనులతో బిజీగా ఉండే సమయంలో ఆ ఇద్దరి మధ్య కీలక విషయాలకు వారధిగా ‘రాజేష్ కిలారు’ వ్యవహరిస్తారని తెలుస్తోంది. దీంతో, చాలామంది టీడీపీ నేతలు కీలక పనుల కోసం ‘రాజేష్ కిలారు’ను సంప్రదిస్తున్నారట.
అమెరికాలో మాస్టర్స్ చదివిన ‘రాజేష్ కిలారు’కు చాలామంది ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులతో సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎన్నారై విభాగంతో ‘రాజేష్ కిలారు’ కు మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే టీడీపీలో చంద్రబాబు, లోకేష్ ల తర్వాత శక్తివంతమైన నేతగా ‘రాజేష్ కిలారు’ కొనసాగుతున్నారని, భవిష్యత్తులో ‘రాజేష్ కిలారు’ టీడీపీలో మరింత కీలక నేతగా ఎదుగుతారని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.