పిఠాపురంలో చంద్రబాబు, పవన్ లకు అవమానం

News Image

పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు ఘోర అవమానం జరిగింది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ ఫొటోలను అధికారులు మరచిపోవడం దుమారం రేపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటో విధిగా పెడుతుండగా…అక్కడ పెట్టలేదు. బాబు, పవన్ పాటు వర్మ ఫొటోను కూడా మరచిపోవడంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. పవన్ ఫొటో ఫ్లెక్సీ పెట్టేవరకూ కార్యక్రమాన్ని జనసేన నేతలు ఆపేశారు. ఆ తర్వాత అధికారులు పవన్ ఫ్లెక్సీ పెట్టడంతో వివాదం సద్దుమణిగింది. చంద్రబాబు ఫొటో మరచిపోయిన క్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. పిఠాపురంలో చాలా కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ ఫొటోలు పెట్టడం మానేశారని, ఇటువంటి అనుభవం తనకూ ఎదురైందని వర్మ చెప్పారు. ఇదే సీన్ రిపీట్ అయితే అధికారులను సస్పెండ్ చేయిస్తానని వర్మ హెచ్చరించారు.

Related News