హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. తరచుగా టీడీపీపై విమర్శలు గుప్పించే విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా కూడా ఆయన వ్యవహరిస్తారని రాజకీయ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. తాజాగాఆయన టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి ఓ ఉచిత సలహా పడేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు పార్టీని అప్పగించాలని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. పద్నాలుగేళ్ల పాలించావు ఇక చాలు అని సలహా…ఇచ్చారు. “ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 9 సంవత్సరాలు, విభజన తర్వాత.. ఐదు ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు. ఇక, చాలు.. మీ అబ్బాయిని చూడండి. ఎంత కష్టపడుతున్నాడో. ఆయనకు అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకపోతే.. లోకేష్ ఏమైపోతాడు. లోకేష్ భవిష్యత్తును నాశనం చేయవద్దు.“ అని ఎంఐఎం అధినేత పేర్కొన్నారు. అంతేకా దు.. ఈసందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపైనా ఓవైసీ రియాక్ట్ అయ్యారు.
“జూనియర్ ఎన్టీఆర్ ఎలానూ రాడు. ఆయన వచ్చినా.. పార్టీని దక్కనివ్వరు కదా? ఏంటి ప్రాబ్లం.“ అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు ఏమైనా వార్తలు వచ్చాయా? ఆయన వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారని సమాచారం ఉందా? అంటే అదీ లేదన్నారు. అలాంటప్పుడు.. నారా లోకేష్‌కు ఇచ్చేయాలని సూచించారు. ఈ మేరకు కర్నూలులో పర్యటించిన ఎంఐఎం అధినేత చంద్రబాబుపై కామెంట్లు చేశారు. కాగా.. గత ఎన్నికల సమయంలోనూ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.