గత కొంతకాలం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న యూత్ స్టార్ నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో `తమ్ముడు` అంటూ ప్రేక్షకులను పలకరించాడు. `వకీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, సౌరభ్ సచదేవ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది.
విడుదలకు ముందు ప్రేక్షకుల్లో తమ్ముడుపై భారీ హైప్ ఏర్పడింది. ట్రైలర్ చూశాక నితిన్ హిట్ కొట్టేస్తాడని అంత అనుకున్నారు. కానీ జూలై 4న విడుదలైన తమ్ముడు చిత్రం తొలి ఆటనుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథలో దమ్ము లేదని ఫిల్మ్ క్రిటిక్స్ తేల్చేశారు. టాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల తమ్ముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది.
నితిన్ కెరీర్ లోనే దారుణమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తమ్ముడు.. 2వ రోజు నుంచి భారీ డ్రాప్స్ చూస్తోంది. ఐదో రోజు మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి జస్ట్ రూ. 12 లక్షలు వచ్చాయంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దూకిన తమ్ముడు.. 5 డేస్ థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో రూ. 2.54 కోట్ల షేర్, రూ. 4.55 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 3.36 కోట్ల షేర్, రూ. 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 21.64 కోట్ల షేర్‌ను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత బిగ్ టార్గెట్‌ను అందుకోవాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. ఆ పరిస్థితి ఎలాగో లేదు కాబట్టి తమ్ముడు పనైపోయిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.