టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న స్పై యాక్షన్ డ్రామా `కింగ్‌డమ్`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా.. సత్యదేవ్ కీలక పాత్రను పోషించాడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించిన కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో రిలీజ్ డేట్ పలుమార్లు పోస్ట్ పోన్ అయింది. ఫైనల్ గా జూలై 31న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కింగ్‌డమ్ ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. రిలీజ్‌కు ఇంకా పది రోజులు ఉందనంగా.. ఈ సినిమాకు కొత్త టైటిల్ ను అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కింగ్డమ్ సినిమా `సామ్రాజ్య` టైటిల్ తో రాబోతోంది. అయితే అన్ని భాషల్లో కాదండోయ్.. కేవలం హిందీలో మాత్రమే.
సామ్రాజ్య పేరుతో హిందీలో సినిమాకు సంబంధించి న్యూ పోస్టర్ ను కూడా వదలడం జరిగింది. అక్కడ టైటిల్ కు మంచి రెస్పాన్సే వస్తోంది. కాగా, గతంలో `లైగర్`తో విజయ్ బొక్క బోర్లా పడ్డారు. ముఖ్యంగా నార్త్‌లో అతని ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. మరి లైగర్‌తో పోయిన పరువును కింగ్‌డమ్(సామ్రాజ్య)తో నిలబెట్టుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.