నటసింహం నందమూరి బాలకృష్ణపైకి కొంచెం కఠినంగా కనిపించిన లోపల మాత్రం చిన్నపిల్లాడి మనస్తత్వమని ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారంతా చెబుతుంటారు. బాలయ్యకు ఒక్కసారి నచ్చారంటే వారికోసం ఎంతవరకు వెళ్లడానికైనా వెనకాడరు. అలాగే సొంత అభిమానులకు కష్టం అంటే వారికి అండగా నిలవడానికి క్షణం కూడా ఆలోచించరు. తాజాగా మరోసారి బాలయ్య తన గొప్ప మనసును చాటుకున్నారు. అపదలో ఉన్న అభిమానికి ఆపన్న హస్తం అందించారు. పూర్తి వివరాలోకి వెళ్తే..
కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణానికి చెందిన బద్రి స్వామి బాలకృష్ణకు వీరాభిమాని. అయితే గత కొద్ది నెలల నుంచి బద్రి స్వామి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కానీ అంతా ఆర్థిక స్తోమత లేకపోవడంతో చికిత్సకు బద్రస్వామి వెనకడుగు వేశారు. ఈ విషయాన్ని ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదస్సేన్ బాలయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు.
తన వీరాభిమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు ఎల్ఓసీ మంజూరు చేయించారు. సంబంధిత పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి స్వయంగా పెళ్లి బద్రస్వామికు అందజేశారు. ఈ విషయం సామాజిక మధ్యలో వైరల్ గా మారడంతో.. బాలయ్య నిజంగా బంగారమే రా అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2` చేస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.