పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్‌ను పులివెందుల ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ అనేది కాస్త డౌన్ అయింది. ఇలాంటి తరుణంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పులివెందుల ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
ఆగస్టు 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 స్థానాలకు పరిమితం చేసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి పార్టీలు.. ఇప్పుడు ఏకంగా సొంత ఇలాకాలో ఓడించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఒకవేళ అదే జరిగిన జగన్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. వైసీపీ కంచుకోటు బద్దలవుతుంది. ఈ నేపథ్యంలోనే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జగన్ కు జీవన్మరణ సమస్యగా మారింది.
బెంగళూరులో ఉన్న జగన్ నిరంతరం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై ఆరా తీస్తున్నారు. జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకునేందుకు ఏం చేయాలో అవినాష్ రెడ్డికి సూచనలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా రంగంలోకి దించారు. ఓటు కోసం డబ్బు వచ్చేందుకు కూడా వైసీపీ వెనకాడటం లేదని.. ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారని ఇన్‌సైడ్ బలంగా టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపులు పులివెండులపైనే పడ్డాయి.