రుద్ర‌గా ప్ర‌భాస్‌.. `క‌న్న‌ప్ప‌` నుంచి ఫ‌స్ట్ లుక్ రివీల్!

News Image

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `క‌న్న‌ప్ప‌`. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంద‌రో స్టార్స్ క‌న్న‌ప్ప‌లో భాగం అవుతున్నారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. రుద్ర పాత్ర‌లో ప్ర‌భాస్‌ క‌నిపించ‌బోతున్నారు. తాజాగా క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ను ప‌రిచ‌యం చేస్తూ ఫ‌స్ట్ లుక్ ను రివీల్ చేశారు. `ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు.. రుద్ర ..` అనే క్యాప్ష‌న్ తో డార్లింగ్ ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాషాయ వస్త్రాలు, చేతిలో పొడవైన దండం, నుదుట విభూది, మెడలో పెద్ద నెద్ద‌ రుద్రాక్ష మాలలు, విగ్గు ధ‌రించి శివ భక్తుడిగా, ఒక సన్యాసి గెటప్ లో ప్ర‌భాస్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్ లో మహా శివుడి ప్రతిరూపం హైలెట్ గా నిలిచింది. అయితే ప్ర‌భాస్ లుక్ పై పాజిటివ్ తో పాటు నెగ‌టివ్ కామెంట్స్ కూడా వ‌స్తున్నారు. రుద్ర గెట‌ప్ లో ప్ర‌భాస్ లుక్ కొంద‌ర్ని మెస్మ‌రైజ్ చేస్తుంటే.. మరికొంద‌రు మాత్రం ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కు స‌న్యాసి గెట‌ప్ ఏమాత్రం సెట్ అవ్వ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి క‌న్న‌ప్ప నుంచి వ‌చ్చిన ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా, క‌న్న‌ప్ప ఏప్రిల్ 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా.. కాజ‌ల్ అగ‌ర్వాల్ పార్వ‌తిగా క‌నిపించ‌బోతున్నారు. మోహ‌న్ బాబు, మోహ‌న్ లాల్‌, శరత్‌కుమార్, దేవరాజ్, మ‌ధుబాల త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Related News