ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో `ఓజీ(They Call Him OG)` ఫీవర్ గట్టిగా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఓజీతో విలన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
రిలీజ్ కు చాలా రోజుల ముందు నుంచే ఓజీ సంచనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ముదులుపుతుంది. ప్రీ అడ్వాన్స్ బుక్కింగ్స్ ప్రారంభమైన ప్రాంతాల్లో ఓజీ టికెట్స్ హాట్ కేక్స్ కంటే వేగంగా అమ్ముడుపోతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ పరంగా మేకర్స్ కూడా జోరు పెంచారు. సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓజీ రిలీజ్‌ను గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తాజాగా ఓ బ్యాడ్ న్యూస్ షాకిచ్చింది.
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో విడుదల అవుతున్న సినిమాలకు ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేసే ట్రెండ్ బాగా నడుస్తోంది. ఓజీ సినిమాకు కూడా సెప్టెంబర్ 24న అలాంటి ప్రీమియర్స్ ఉంటాయనుకుని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. బట్ మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ఓజీకి స్పెషల్ ప్రీమియర్స్ లేవని స్పష్టం చేసి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. అయితే విడుదల రోజు తెల్లవారుజామున 1 గంటకు, అలాగే 4 గంటలకు స్పెషల్ షోస్ ప్రదర్శించేందుకు మాత్రం ప్లానింగ్ జరుగుతోంది.