ఏపీలో హిందూజా పెట్టుబడులకు ఎంవోయూ: చంద్రబాబు

admin
Published by Admin — November 04, 2025 in Nri
News Image

హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో లండన్ లో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించింది. విశాఖలో ఉన్న హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి పెంచేందుకు ఎంవోయూ కుదిరింది.

రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ లను ఏర్పాటు చేసే అంశంపై కూడా అవగాహనా ఒప్పందం కుదిరింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై ఎంవోయూ కుదిరింది. ఏపీలో గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేలా హిందూజా గ్రూప్ సహకరించనుంది.

News Image
News Image
Tags
Ap government mou hinduja group
Recent Comments
Leave a Comment

Related News