నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా ఒక సంచలనం. ఇప్పుడు ‘అఖండ 2 తాండవం’ కూడా అదే రేంజ్‌లో హైప్‌ను సృష్టించింది. అయితే డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చివరి నిమిషంలో వాయిదా పడటం ఫ్యాన్స్‌కు పెద్ద షాక్. ప్రీమియర్స్ రద్దు అవ్వడంతో అప్పటికే థియేటర్ల వద్దకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. అయితే రిలీజ్ వాయిదా పడినా ఈ సినిమా బాలయ్య ఖాతాలో ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లకు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఉన్నప్పటికీ, వాళ్లు తమ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు స్వయంగా వాయిస్ ఇచ్చిన సందర్భం లేదు. చిరు ‘సైరా’ వంటి పాన్ ఇండియా ప్రయత్నాలు చేసినా, నాగ్–వెంకీ సూట్ అయ్యే పాత్రలతో బాలీవుడ్‌లో నటించినా… తమ సినిమాల హిందీ వర్షన్‌కి డబ్బింగ్ చెప్పడం మాత్రం చేయలేదు.
కానీ బాలయ్య మాత్రం ట్రెండ్ బ్రేకర్‌గా నిలిచారు.. ‘అఖండ 2’ హిందీ వెర్షన్‌లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పి టాలీవుడ్ సీనియర్ హీరోల్లో కొత్త బెంచ్‌మార్క్ పెట్టాడు. ఇదే కాకుండా, గతంలో ‘భగవంత్ కేసరి’ హిందీ వర్షన్‌కు కూడా తానే వాయిస్ ఇచ్చాడు. యువ హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నా… సీనియర్ హీరోల్లో ఈ ఘనత ఒక్క బాలయ్యకు మాత్రమే దక్కింది.
మరొక రేర్ ఫీట్ ఏంటంటే.. చిరు, వెంకీ, నాగ్ సినిమాలు ఎన్నో వస్తున్నా వారిలో ఎవరూ ఇప్పటివరకు 3డీ ఫార్మాట్‌లో మూవీని విడుదల చేయలేదు. కానీ ‘అఖండ 2 తాండవం’ మాత్రం 3డీలో విడుదల అయ్యే మొదటి సీనియర్ హీరో మూవీగా నిలుస్తోంది. టెక్నికల్‌గా ఇది బాలయ్య కెరీర్‌లో పెద్ద మైలురాయి. యాక్షన్ సీక్వెన్సులు, మాస్ విజువల్స్‌ను 3డీలో చూపించడం అభిమానులకి మరో స్థాయి ఫీలింగ్ ఇవ్వబోతోంది.