పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ పార్థివ దేహం నిన్న స్వగ్రామానికి చేరుకుంది. మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయంతోపాటు పవన్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు.
మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పవన్..వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు, జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రBg ఏర్పాటు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన నెల జీతం ఆర్థిక సాయంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ కుటుంబ సభ్యులను బాలయ్య పరామర్శించనున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి మంత్రి లోకేశ్, మంత్రి సత్య కుమార్ తదితరులు నివాళులు అర్పించారు.