వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్న డిమాండ్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పటి వరకు మౌఖికంగా.. ఎలాంటి నిర్ణయ మూ తీసుకోకపోయినా.. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ఆయన రూలింగ్‌ను జారీ చేశారు. గత సంప్రదాయాలను ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. 1994లోనూ ఇలానే సమస్య వచ్చినప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి ఇవ్వలేదని తెలిపారు.
ఇక, తెలంగాణలోనూ మొదట్లో ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండేదని.. కానీ, ఆ తర్వాత సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ పార్టీకి ఆ హోదాను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఇదేసమయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, వార్తలపై పరోక్షంగా స్పందించిన అయ్యన్న
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్న డిమాండ్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పటి వరకు మౌఖికంగా.. ఎలాంటి నిర్ణయ మూ తీసుకోకపోయినా.. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ఆయన రూలింగ్‌ను జారీ చేశారు. గత సంప్రదాయాలను ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. 1994లోనూ ఇలానే సమస్య వచ్చినప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి ఇవ్వలేదని తెలిపారు.
ఇక, తెలంగాణలోనూ మొదట్లో ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండేదని.. కానీ, ఆ తర్వాత సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ పార్టీకి ఆ హోదాను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఇదేసమయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, వార్తలపై పరోక్షంగా స్పందించిన అయ్యన్న పాత్రుడు.. అసెంబ్లీ విధివిధానాలు పార్లమెంటరీ విధానాల ప్రకారం ఉంటాయని.. గతంలో పార్లమెంటు అనుసరించిన విధానాలనే పాటిస్తున్నామని తెలిపారు.
వీటిని బట్టి.. ప్రజలు ఇవ్వని ప్రధాన ప్రతిపక్ష హోదాను తాను ఇవ్వలేనని తేల్చి చెప్పారు. ఈ సందర్భం గా.. మాజీ సీఎం ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తూ.. ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అని సూత్రీకరించారు. అలాంటి దేవాలయంలో తాను కేవలం పూజారిని మాత్రమేనని పేర్కొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. దేవుడు ఇవ్వని వరాన్ని(ప్రధాన ప్రతిపక్షం) తాను వైసీపీకి ఇవ్వలేదనని తెలిపారు. అయితే.. 11 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ సభ్యులు సభకు రావాలని మాత్రం కోరారు.
జగన్‌ను క్షమిస్తున్నా..
తాజాగా అసెంబ్లీ స్పీకర్ పాస్ చేసిన రూలింగ్‌లో స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన ప్రతి పక్ష హోదా ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. అక్కడ సదరు పిటిషన్ విచారణార్హత దశలోనే ఉందన్న విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు. “జగన్ వేసిన పిటిషన్ ఇంకా విచారణకు అర్హతో కాదో తేల్చే దశలోనే ఉంది. కానీ, బయట మాత్రం సభాపతిగా నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా భరించా. సంధి ప్రేలాపనలుగానే భావించా. అందుకే జగన్ ను క్షమిస్తున్నా. కానీ, ఇకపై మాత్రం నాపైనా.. సభపైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే.. సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తప్పవు“ అని స్పీకర్ హెచ్చరించారు.