ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరం.. ఐటీ, పెట్టుబడులు.. వంటి అం శాలపై చంద్రబాబు చెబుతుంటారు. అయితే.. తాజాగా మాత్రం ఆయన `పురాణాల గురించి` మాట్లాడారు. అంతేకాదు.. ప్రతి ఇంట్లోనూ చిన్నారులకు తల్లిదండ్రులు పురాణాల గురించి చెప్పాలని... హిందూ దేవ తల గురించి వివరించాలని చంద్రబాబు చెప్పడం విశేషం. తాజాగా తిరుపతిలో ప్రారంభమైన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. పురాణాలు నేర్పించాలని చెప్పడమే కా కుండా.. `సూపర్ మ్యాన్` గురించి కాకుండా.. రామాయణంలోని హనుమంతుడి గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ``సూపర్ మ్యాన్ కంటే కూడా హనుమంతుడు చాలా గొప్పవాడు. బ్యాట్‌మాన్, ఐరన్‌మ్యాన్ కంటే కూడా అర్జునుడు గొప్పయోధుడు. వారి గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి.`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాముడు, రామరాజ్యం వంటి వాటిని తెలుసుకుని వివరించా లని సూచించారు.
రాముడిని మించిన పురుషోత్తముడు ఈ ప్రపంచంలోనే లేరని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ``మీరు అవతార్ సినిమా చూశారు.కానీ, దానికంటే కూడా.. మన భారతం, భాగవతం, రామాయణాలు చాలా గొప్పవి`` అని చెప్పడం మరింత విశేషం. ఇదేసమయంలో దివంగత ఎన్టీఆర్ గురించి కూడా కీలక వ్యాఖ్య లు చేశారు. ప్రజలు రాముడు, కృష్ణుడిని మరిచిపోతున్న సమయంలో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రలు తీసి.. ప్రజలకు అవగాహన కల్పించారని.. చెప్పారు. మొత్తంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గతానికి భిన్నంగా ఉండడం గమనార్హం.
ఎందుకిలా?
ప్రస్తుతం బీజేపీకి అత్యంత చేరువగా ఉంటున్న చంద్రబాబు.. దాదాపు ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణం గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పురాణాలు.. రాముడు, కృష్ణుడు, అర్జునుడు వంటి పాత్రలను తెరమీదికి తీసుకువచ్చి.. కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.